యూపీఐ పేమెంట్స్ లో భారత్ శరవేగంగా దూసుకుపోతోంది. డిజిటల్ చెల్లింపుల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని గ్లోబల్ డేటా సంస్థ నివేదిక వెల్లడించింది. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో అత్యధికంగా డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నట్లు ఈ సంస్థ వెల్లడించింది.
యూపీఐ పేమెంట్స్ లో భారత్ శరవేగంగా దూసుకుపోతోంది. డిజిటల్ చెల్లింపుల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని గ్లోబల్ డేటా సంస్థ నివేదిక వెల్లడించింది. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో అత్యధికంగా డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నట్లు ఈ సంస్థ వెల్లడించింది. 2023లో భారత జనాభాలో 90.8 శాతం యూపీఐ ద్వారా లావాదేవీలు జరిపినట్లు ఈ సంస్థ పేర్కొంది. ఏటా ఈ లావాదేవీలు భారీగా పెరుగుతున్నట్లు ఈ సంస్థ చెబుతోంది. 2024 ఏప్రిల్ లో ఏకంగా 19.64 లక్షల కోట్ల లావాదేవీలు యూపీఐ ద్వారా జరిగినట్లు ఈ సంస్థ వివరించింది. మే నెలలో తొలి 15 రోజుల్లోనే 10.70 లక్షల కోట్ల పేమెంట్స్ జరిగినట్లు తెలిపింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతినెలా డిజిటల్ నగదు లావాదేవీలు భారత్ లో భారీగా పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం స్మార్ట్ ఫోన్లు వినియోగం భారీగా పెరగడమేనని చెబుతున్నారు.
స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ డిజిటల్ పేమెంట్స్ చేసేందుకు అనుకూలమైన యూపీఐ యాప్స్ ను వినియోగిస్తున్నారు. దీనివల్ల ప్రతి చిన్న ఆర్థిక అవసరానికి డిజిటల్ నగదు లావాదేవీలను నిర్వహిస్తున్నారు. కరోనా తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు కారణంగా డిజిటల్ లావాదేవీలు పెరుగుదలకు ఆస్కారం ఏర్పడింది. చిన్నపాటి టి దుకాణం నుంచి స్టార్ హోటల్ వరకు డిజిటల్ పేమెంట్స్ స్వీకరించేందుకు అనుగునమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విజయవంతమైందని చెప్పవచ్చు. కరోనా తర్వాత డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశంతో తీసుకున్న చర్యలు ఫలితంగానే ప్రతినెల డిజిటల్ లావాదేవీలు భారీగా పెరుగుతున్నట్లు ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని రెట్లు డిజిటల్ లావాదేవీలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.