Gold Rates : రూ.75 వేలకు చేరిన బంగారం.. హైదరాబాద్‌లో తులం ధర ఉందంటే..

Hyderabad Gold Rates : ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న బంగారం ధర పరుగులు పెడుతూ రూ.75 వేల మార్కును చేరుకుంది. శుక్రవారం సాయంత్రం ఢిల్లీ స్పాట్ మార్కెట్‌లో స్థానిక పన్నులతో కలిపి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.75,550గా నమోదైంది.

gold rates in hyderabad
ప్రతీకాత్మక చిత్రం Photo: Instagram

ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న బంగారం ధర పరుగులు పెడుతూ రూ.75 వేల మార్కును చేరుకుంది. శుక్రవారం సాయంత్రం ఢిల్లీ స్పాట్ మార్కెట్‌లో స్థానిక పన్నులతో కలిపి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.75,550గా నమోదైంది. ఒక్క రోజులోనే దాదాపు వెయ్యి రూపాయలు పెరిగింది. అంతర్జాతీయంగా బంగారానికి గిరాకీ పెరగటంతో దేశీయంగానూ ధరలు సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణ పరిస్థితులే బంగారం ధర పెరగటానికి కారణం అని విశ్లేషకులు చెప్తున్నారు. కాగా, హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,310గా ఉంది. 22 క్యారెట్ల బంగారం రూ.వెయ్యి పెరిగి రూ.67,200 వద్దకు చేరింది. వెండి ధర కూడా భారీగా పెరిగింది. ఢిల్లీ స్పాట్ మార్కెట్‌లో కిలో వెండి రూ.86,300గా ఉంది. శుక్రవారం ఒక్క రోజే రూ.1,400 మేర పెరిగింది. 

పది రోజుల్లోనే రూ.10 వేలు పెరిగిన ధర

గత నెల రోజుల్లో బంగారం ధరలు 10 శాతం పెరిగాయి. ఆరు నెలల కాలాన్ని చూసుకొంటే 25 శాతం వరకు ధరలు రికార్డు సృష్టించాయి. గత పది రోజుల్లోనే బంగారం ధర రూ.10 వేలు పెరగటం గమనార్హం. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వ్యాపారం సాగదని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. పండుగలతో కొంత మేర పుంజుకొన్నా, ఎన్నికల ఆంక్షలు అమ్మకాలపై ప్రభావం చూపుతాయని అభిప్రాయపడుతున్నాయి.


వెబ్ స్టోరీస్