Gold Rate Today: పెరిగిన బంగారం ధరలు..నేటి ధరలు ఎలా ఉన్నాయంటే

బంగారం ధరలు నేడు భారీగా పెరిగాయి. పసిడి మరోసారి రికార్డు దిశగా పరుగులు పెడుతోంది. 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 74 వేల సమీపంలో ట్రేడ్ అవుతోంది. తాజాగా ఆగస్టు 31 శనివారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర. రూ.73,800 పలుకుతుండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,602గా పలుకుతోంది.

gold

ప్రతీకాత్మక చిత్రం 

బంగారం ధరలు నేడు భారీగా పెరిగాయి.  పసిడి మరోసారి రికార్డు దిశగా పరుగులు పెడుతోంది.  24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 74 వేల సమీపంలో ట్రేడ్ అవుతోంది.  తాజాగా ఆగస్టు 31 శనివారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.  నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.  రూ.73,800 పలుకుతుండగా,  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,602గా పలుకుతోంది.  

బంగారం ధర త్వరలోనే 75 వేల రూపాయల వద్ద  గతంలో నమోదు చేసిన గరిష్ట స్థాయిని దాటే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు శ్రావణమాసం ముగియనుంది.  వచ్చే భాద్రపద మాసంలో పెద్దగా వివాహ ముహూర్తాలు లేవు.  కానీ ఆ తర్వాత వచ్చే ఫెస్టివల్ సీజన్లో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు మళ్లీ జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు.  సాధారణంగా దీపావళి దసరా నేపథ్యంలో బంగారం అత్యధికంగా కొనుగోలు చేస్తారు.  కానీ ఈ సీజన్లో ధరలు అధికంగా ఉండే అవకాశం ఉందని నగల వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

ఒకవేళ బంగారం ఆల్ టైం గరిష్ట స్థాయిని అందుకుంటే జనం ఆసక్తి తగ్గుతుందని భావిస్తున్నారు.  అయితే బంగారం ధరలు మధ్యలో స్వల్ప కరెక్షన్ వచ్చే అవకాశం ఉందని అప్పుడు కాస్త తగ్గవచ్చు అని అంచనా వేస్తున్నారు.  అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు పెరిగేందుకే ఎక్కువగా అవకాశం కనిపిస్తోంది.  ఎందుకు ప్రధానంగా అమెరికాలో కీలక వడ్డీ రేట్లు ఫెడరల్ రిజర్వ్ తగ్గించే అవకాశం ఉంది.  దీంతో బంగారం ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ మార్కెట్లలో విశ్లేషకులు చెబుతున్నారు.  పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను ఎక్కువగా బంగారంపై పెట్టే అవకాశం ఉందని సూచిస్తున్నారు. 

 అటు చైనా లాంటి అగ్రరాజ్యాలు బంగారం పై తమ పెట్టుబడులను భారీగా పెంచుతున్నాయి. ఎడాపెడ ప్రపంచంలో ఎంత బంగారం లభిస్తే అంతా తమ సెంట్రల్ బ్యాంకుకు తరలిస్తున్నాయి.  బంగారం ధరలు భారీగా పెరిగితే ఎవరైతే గతంలో బంగారంపై పెట్టుబడి పెట్టారు వారికి లాభదాయకం అని చెప్పవచ్చు.  అయితే బంగారంపై పెట్టుబడి పెట్టడం అంటే కేవలం ఫిజికల్ గోల్డ్ కొనుగోలు చేయడం కాదు. 

 బంగారాన్ని బాండ్ల రూపంలోనూ,  మ్యూచువల్ ఫండ్స్ రూపంలోనూ పెట్టుబడి పెట్టిన వారికి పెద్ద మొత్తంలో లాభం వచ్చే అవకాశం ఉంది.  మీరు కూడా బంగారంపై లాభం పొందాలి అనుకున్నట్లయితే ఫిజికల్ గోల్డ్ కు బదులుగా ఆర్బీఐ జారీ చేసే సావరిన్ గోల్డ్ బాండ్లు, గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్స్ లో  పెట్టుబడి పెడితే  పెరుగుతున్న బంగారం నుంచి లాభాలను ఒడిసిపట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్