Gold Rate Today: షాకిచ్చిన బంగారం ధరలు.. భారీగా పెరిగిన పసడి ధర

శనివారం పసిడి ప్రియులకు షాక్ తగిలింది. బంగారం ధర ఏకంగా 600 రూపాయలు పెరిగింది. దీంతో ఆవరణలో కొనుగోలు చేసే వారంతా ఆందోళనకు గురవుతున్నారు.

gold rate

ప్రతీకాత్మక చిత్రం 

శనివారం పసిడి ప్రియులకు షాక్ తగిలింది. బంగారం ధర ఏకంగా 600 రూపాయలు పెరిగింది. దీంతో ఆభరణాలు  కొనుగోలు చేసే వారంతా ఆందోళనకు గురవుతున్నారు.  ఒకరోజు గ్యాప్ లోనే ఇంత రేంజ్ లో పెరిగింది ఏంటా అని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం బంగారం ధరలు చూస్తే ఇలా ఉన్నాయి.. 24 క్యారెట్ల బంగారం ధర 73, 320 రూపాయల వద్ద పలుకుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర 67,350 వద్ద పలుకుతోంది. పసిడి ధరలు భారీగా పెరగడం వెనుక  అంతర్జాతీయంగా అమెరికా స్టాక్ మార్కెట్లలో పతనం కూడా ఒక కారణంగా చెబుతున్నాడు. 

సాధారణంగా స్టాక్ మార్కెట్లో పతనం అయినప్పుడల్లా,  బంగారం ధర పెరుగుతూ ఉంటుంది. ఈ రెండింటికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో నష్టాలు చవిచూస్తున్నప్పుడు,  తమ డబ్బును అక్కడి నుంచి బంగారం మార్కెట్ వైపు తరలిస్తుంటారు. ఎందుకంటే బంగారం అనేది సురక్షితమైన పెట్టుబడి సాధనము.  చైనా సైతం పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ఉన్న బంగారాన్ని కొనుగోలు చేస్తుంటుంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా బంగారానికి డిమాండ్ ఏర్పడింది. బంగారం ధరలు అంతర్జాతీయ పరిణామాల పైనే ఎక్కువగా ఆధారపడి హెచ్చుతగ్గులకు లోనవుతూ ఉంటాయి. త్వరలోనే అమెరికా ఫెడరల్ రిజర్వ్  కీలక వడ్డీ రేట్లు కూడా తగ్గిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక జరిగితే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. 

 ఇక దేశీయంగా గమనిస్తే బంగారం ధరలు స్థానికంగా పెళ్లిళ్లు, శుభముహూర్తాల కారణంగా హెచ్చుతగ్గులకు గురవుతూ ఉంటాయి. మన దేశంలో వివాహాది శుభకార్యాలకు బంగారం ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు.  ప్రస్తుతం శ్రావణమాసం ముగిసింది దీంతో బంగారానికి కాస్త గిరాకీ తగ్గింది. అయితే మళ్లీ దసరా దీపావళి సందర్భంగా బంగారం అత్యధికంగా కొనుగోలు చేస్తూ ఉంటారు.  ప్రధానంగా ధన త్రయోదశి లాంటి పండగలు కూడా ఈ ఫెస్టివల్ సీజన్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బంగారం ఆభరణాలు పెద్ద ఎత్తున కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.  దీంతో దేశీయంగా డిమాండ్ పెరిగి బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంటుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్