Gold Rate Today : స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,700 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66, 700 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారం ధరలు దేశవ్యాప్తంగా స్వల్పంగా తగ్గుముఖం పడుతున్నాయి.

gold rate

ప్రతీకాత్మక చిత్రం 

గడచిన కొన్ని రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నప్పటికీ నేడు మాత్రం బంగారం ధర తగ్గుముఖం పట్టింది దీంతో పసిడి ధర సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,700 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66, 700 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారం ధరలు దేశవ్యాప్తంగా స్వల్పంగా తగ్గుముఖం పడుతున్నాయి.

 అయినప్పటికీ బంగారం ధర ఆల్ టైం గరిష్ట స్థాయి అయినా 75 వేల కన్నా కూడా కేవలం 2000 రూపాయలు మాత్రమే తక్కువగా ఉంది అయితే బంగారం ధర ఈ నెలలో భారీగా పెరిగినట్లు గమనించవచ్చు ఈ నెల ప్రారంభం నుంచి కూడా బంగారం ధర పెరుగుతూనే ఉంది. ఒక దశలో బంగారం ధర 73 వేల రూపాయలు దాటింది అక్కడి నుంచి బంగారం ధర స్వల్పంగా తగ్గుతూ వస్తోంది గత నెలలో కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకం తగ్గించడంతో ఒక్కసారిగా బంగారం ధర భారీగా తగ్గుముఖం పట్టింది.

 కానీ అక్కడి నుంచి మాత్రం నెమ్మదిగా బంగారం ధర పెరుగుతూనే వస్తుంది పరిస్థితి ఇలాగే కొనసాగినట్లయితే అతి త్వరలోనే బంగారం ధర మరోసారి ఆల్ టైం గరిష్ట స్థాయి అయినా 75 వేల రూపాయలను దాటే అవకాశం ఉంది. అయితే బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో మీరు బంగారు ఆభరణాలు కొనుగోలుకు వెళుతున్నట్లయితే చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా నిపుణులు సూచిస్తున్నారు ఎందుకంటే ఒక గ్రామంలో తేడా వచ్చిన మీకు దాదాపు 7 వేల రూపాయల వరకు నష్టం వచ్చే ప్రమాదం ఉంటుంది ముఖ్యంగా మీరు బంగారం తూకం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

 ఎందుకంటే మీరు బిల్ వేసిన తర్వాత కూడా తూకాన్ని మరోసారి చూసుకున్న తర్వాతే షాపు బయటకు వెళ్లాల్సి ఉంటుంది. ఇక నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడవద్దు మీరు గోల్డ్ హాల్ మార్క్ చూసిన తర్వాతే ఆభరణాలను కొనుగోలు చేయాలి .చెవి దిద్దుల నుంచి చిన్న చిన్న బంగారు ఆభరణాల వరకు ఈ హాల్ మార్క్ గుర్తు తప్పనిసరిగా ఉంటుంది అప్పుడే మీరు బంగారం కొనుగోలు చేయాలి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్