శ్రావణ మాసంలో బంగారం ధరలు మరోసారి షాక్ ఇస్తున్నాయి. తాజాగా ఆగస్టు 14వ తేదీ బుధవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. నేడు హైదరాబాదులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 71,6220 ఉంది.
ప్రతీకాత్మక చిత్రం
శ్రావణ మాసంలో బంగారం ధరలు మరోసారి షాక్ ఇస్తున్నాయి. తాజాగా ఆగస్టు 14వ తేదీ బుధవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. నేడు హైదరాబాదులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 71,6220 ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 65,650 ఉంది. నిన్నటి ధరతో పోల్చి చూసినట్లయితే, బంగారం ధర నేడు ఒకరోజే 250 రూపాయలు పెరిగింది. దీంతో పసిడి ప్రేమికులు గగ్గోలు పెడుతున్నారు. గడచిన రెండు వారాలుగా గమనించినట్లయితే, బంగారం ధరల్లో గందరగోళం కొనసాగుతోంది. బంగారం ధరలు ప్రస్తుతం రెండు రోజుల క్రితం స్వల్పంగా తగ్గినప్పటికీ నేడు మాత్రం బంగారం ధరలు ఏకంగా 250 రూపాయలు చొప్పున పెరిగాయి. దీంతో బంగారం ధరలు భారీగా పెరగడంతో పసిడి ఆభరణాల ధరలు కూడా భారీగా పెరిగాయి.
బంగారం ధరలు ప్రబలంగా పెరగడానికి అంతర్జాతీయ కారణాలతో పాటు దేశీయ కారణాలు కూడా ప్రధానంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశీయంగా శ్రావణమాసం కావడంతో బంగారానికి డిమాండ్ భారీగా పెరిగిందని తద్వారా ధరలు కూడా భారీగా పెరిగాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా శ్రావణమాసంలో పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు వివాహది శుభకార్యాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయాలంటే, డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ధర కూడా ఆటోమేటిక్ గా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక అంతర్జాతీయంగా పరిశీలిస్తే అమెరికాలో ప్రస్తుతం ఒక హౌస్ బంగారం ధర 2400 డాలర్లు పైగా ట్రేడ్ అవుతోంది. దీంతో దేశీయంగా కూడా బంగారం ధరలు తగ్గడానికి ఎలాంటి ప్రోత్సాహం లభించడం లేదు. ఫలితంగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి.
అయితే ప్రస్తుత రేంజ్ నుంచి బంగారం ధరలు తగ్గుతాయా లేక పెరుగుతాయా అనే సందేహాలు మాత్రం కస్టమర్లను తొలుస్తూనే ఉన్నాయి. ఎందుకంటే గత నెలలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా బంగారం ధరలు ఏకంగా గరిష్ట స్థాయి 75,000 రూపాయల నుంచి పోల్చి చూస్తే దాదాపు ఒకే వారంలో 7000 రూపాయల వరకు తగ్గింది. దీంతో పసిడి ధరలు రూ. 67 వేల వరకూ పడింది. అయితే ప్రస్తుతం మాత్రం పసిడి ధరలు దాదాపు రూ. 71000 రేంజులో కదులుతున్నాయి