బంగారం ధరలు తగ్గుతున్నాయి. వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. వారాంతంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఏకంగా రూ. 1,700 వరకు తగ్గింది. తాజాగా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ప్రతీకాత్మక చిత్రం
మొత్తానికి బంగారం ధరలు తగ్గుతున్నాయి. రేపటి నుంచి శ్రావణ మాసం షురూ. అంటే శుభకార్యాలు, పెళ్లిలు, ఫంక్షన్లను అన్నీ ప్రారంభం అవుతాయి. ఇప్పుడు బంగారం కొనేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా పెరుగుతున్న బంగారం ధర ఇప్పుడు దిగి వచ్చింది. వారాంతంలో బంగారం వెలవెలబోవడంతో పసిడి ప్రేమికులు సంబురపడుతున్నారు.
ఇంతకు బంగారం ధరలు ఎంత తగ్గాయి. ఇప్పుడు కొనచ్చా..ఫ్యూచర్ లో ఇంకా తగ్గుతాయా..ప్రస్తుతం బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఏలా ఉన్నాయో తెలుసుకుందాం. ఏపీ, తెలంగాణలో బంగారం ధరలు శనివారం రోజు తగ్గాయి. వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. గత మూడు రోజులుగా దూసుకుపోతున్న బంగారం, వెండి ధరలు ఇప్పుడు దిగి రావడం సానుకూల అంశమని చెప్పవచ్చు. దీని వల్ల బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావించేవారికి ఊరట కల్పించే విషయమే.
ఇక బంగారం ధరలు చూసినట్లయితే 24 క్యారెట్ల బంగారం ధరూ. 110 తగ్గింది. దీంతో బంగారం ధఱ రూ. 70, 690 నుంచి రూ. 70,580వ తగ్గింది. ఈ ఆదివారం అంటే ఆగస్టు 4న కూడా ఇవే ధరలు కొనసాగుతాయి. 10 గ్రాములకు ఈ ధరలు వర్తిస్తాయి. అటు 22 క్యారెట్ల ఆర్నమెంట్స్ ధర చూసినట్లయితే..రూ. 100 తగ్గింది. రూ. 64,800 నుంచి రూ. 64, 700కి పడిపోయింది. ఈ ధరలు పది గ్రాములకు వర్తిస్తాయి. ఇక వెండి ధర కూడా రూ. 1,700 పడిపోయింది. దీంతో వెండి ధర రూ. 85,500కు దిగి వచ్చింది.