Gold Rate: పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్. బుధవారం తగ్గిన బంగారం ధర నేడు భారీగా పెరిగింది. హైదరాబాద్ తోపాటు దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం
ప్రతీకాత్మక చిత్రం
బంగారం ప్రియులకు మరోసారి షాక్ తగిలింది. మొన్న వరకు స్థిరంగా ఉన్న బంగారం ధర నిన్న కాస్త తగ్గింది. దీంతో ఇంకా తగ్గుతుందని భావించిన కొనుగోలు దారులకు గురువారం పెరిగిన ధరలు షాకిచ్చాయి. గురువారం బంగారం ధరలు పెరిగాయి. దీంతో బంగారం కొనుగోలు దారులకు నిరాశ ఎదురయ్యింది.
ఇక తెలంగాణ, ఏపీలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను చూసినట్లయితే..హైదరాబాద్, విశాఖ, విజయవాడ, నగరాలతోపాటు పలు ప్రాంతాల్లో గురువారం 22క్యారెట్ల పసిడి పది గ్రాములకు రూ. 500 వరకు పెరిగింది. దీంతో ఇది రూ. 67,100కు చేరింది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 550 పెరిగి..73,200 దగ్గరకు చేరింది. ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాల్లో కూడా ఇవే బంగారం ధరలు కొనసాగుతున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో గురువారం బంగారం ధరలు రిగాయి. 22క్యారెట్ల బంగారం ధర రూ. 500 పెరిగి.. 22క్యారెట్ల బంగారం ధర రూ. 67,250కి చేరింది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 550 పెరిగి రూ. 73,350కి పెరిగింది. దేశవ్యాప్తంగా వెండి ధరల్లో మాత్రం గురువారం ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్ లో ప్రస్తుతం వెండి కిలో ధర రూ. 92,000 ఉంది.