Today Gold Rate: మగువలకు షాకింగ్ న్యూస్..పెరిగిన బంగారం ధర

కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బంగారం, వెండి ధరలు తగ్గడంతో కొనుగోలుదారులతో దుకాణాలు కలకలలాడాయి. గత వారం రోజులు బంగారం, వెండి ధరలు భారీగా పడిపోవడంతో కస్టమర్లు కొనేందుకు ఆసక్తి చూపించారు. ఈ క్రమంలోనే రెండు రోజుల నుంచి బంారం, వెండి ధరలు పెరుగుతూ మళ్లీ షాకిస్తున్నాయి. నేడు బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం.

gold rate

ప్రతీకాత్మ చిత్రం 

కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బంగారం, వెండి ధరలు తగ్గడంతో  కొనుగోలుదారులతో దుకాణాలు కలకలలాడాయి. గత వారం రోజులు బంగారం, వెండి ధరలు భారీగా పడిపోవడంతో కస్టమర్లు కొనేందుకు ఆసక్తి చూపించారు. ఈ క్రమంలోనే రెండు రోజుల నుంచి బంారం, వెండి ధరలు పెరుగుతూ మళ్లీ షాకిస్తున్నాయి.బంగారం, వెండి ధరపై కస్టమ్స్ సుంకం 60శాతం తగ్గించడంతో ఈ మధ్య బంగారం,వెండి ధరలు తగ్గాయి. వాస్తవానికి బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు జరగడం సాధారణమే. ఒక్కోసారి ధరలు తగ్గితే మరికొన్ని సార్లు పెరుగుతాయి. శనివారం ఉదయం 6గంటలకు నమోదు అయిన ధరల ప్రకారం తాజాగా ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల పది గ్రాముల ధర పసిడి ధర రూ.70,100 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర 64,260 గా ఉంది. 24 క్యారెట్లపై 820, 22 క్యారెట్లపై 750 ధర పెరిగింది. వెండి ధర కిలో రూ.83,100లుగా ఉంది. వెండి ధర 16  పెరిగింది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 64,260, 24 క్యారెట్ల గోల్డ్ రేట్  రూ.70,100గా ఉంది. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,260, 24 క్యారెట్ల పసిడి ధర రూ.70,100 పలుకుతోంది. ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్  రూ.64,410, 24 క్యారెట్ల ధర రూ.70,250, ముంబైలో 22 క్యారెట్లు రూ.64,260, 24 క్యారెట్లు రూ.70,100, చెన్నైలో 22క్యారెట్లు రూ.64,260, 24 క్యారెట్లు రూ.70,100, బెంగళూరులో 22క్యారెట్ల రేటు రూ.64,260, 24 క్యారెట్లు రూ.70,100గా నమోదు అయ్యింది. 

ఇక అటు ఢిల్లీలో వెండి కిలో ధర రూ.83,100, ముంబైలో రూ.83,100, బెంగళూరులో రూ.80,650, చెన్నైలో రూ.88,100, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో రూ.88,100 పలుకుతోంది. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్