భారతీయ ఉద్యోగులకు అమెజాన్ షాక్.. 500 మందికి కంపెనీ నుంచి గుడ్‌బై

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||500 మంది భారతీయ ఉద్యోగులకు అమెజాన్ ఉద్వాసన Photo: Twitter||

ఈవార్తలు, బిజినెస్ న్యూస్: ప్రముఖ ఈకామర్స్ కంపెనీ అమెజాన్ భారతీయ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. దేశంలోని దాదాపు 500 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా తమ కంపెనీలో పనిచేస్తున్న 9 వేల మందిని తొలగిస్తున్నట్లు గత మార్చిలో ప్రకటించిన ఆ సంస్థ.. ఈ మేరకు భారత్‌లో 500 మందికి లేఆఫ్ ప్రకటించినట్లు సంబంధిత వర్గాల ద్వారా సమాచారం అందింది. వెబ్ సర్వీసెస్, హ్యూమన్ రిసోర్సెస్, సపోర్ట్ డిపార్ట్‌మెంట్ నుంచి ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. ఫైనాన్షియల్‌గా స్థిరత్వాన్ని పొందటానికే తాము ఉద్యోగులపై వేటు వేస్తున్నట్లు గతంలో కంపెనీ సీఈవో ఆండీ జెస్సీ పేర్కొన్నారు.

కరోనా సమయంలో భారీగా రిక్రూట్ చేసుకున్న అమెజాన్.. ఆ తర్వాత ఆదాయంలో వృద్ధి నెమ్మదించటంతో ఉద్యోగులను తొలగిస్తోంది. ఇదే కాకుండా, ఆర్థిక మాంద్యం, వడ్డీ రేట్ల పెంపు తదితర కారణాలతో వినియోగదారులు కొనుగోలు విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ తదితర కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి.

వెబ్ స్టోరీస్