Amazon Great Summer sale : మే 2 నుంచి అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు

ప్రముఖ ఈ-కామర్స్‌ వెబ్‌సైట్ అమెజాన్‌ (Amazon) వినియోగదారులకు పండగ లాంటి వార్త చెప్పింది. సెగలు కక్కుతున్న ఈ ఎండల్లో చల్లని కబురు చెప్పింది. గ్రేట్ సమ్మర్ సేల్ పేరుతో మార్కెట్‌లోకి వస్తున్నామని ప్రకటించింది.

amazon great summer sale
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్

ఈవార్తలు, బిజినెస్ న్యూస్: ప్రముఖ ఈ-కామర్స్‌ వెబ్‌సైట్ అమెజాన్‌ (Amazon.in) వినియోగదారులకు పండగ లాంటి వార్త చెప్పింది. సెగలు కక్కుతున్న ఈ ఎండల్లో చల్లని కబురు చెప్పింది. గ్రేట్ సమ్మర్ సేల్ Amazon Great Summer Sale పేరుతో మార్కెట్‌లోకి వస్తున్నామని ప్రకటించింది. దానికి సంబంధించిన తేదీలను వెల్లడించింది. మే 2 మధ్యాహ్నం నుంచి ఈ సేల్‌ ప్రారంభం కానుందని తెలిపింది. ప్రైమ్‌ కస్టమర్లకు మే 1 అర్థరాత్రి 12 నుంచే సేల్‌ ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో భాగంగా డిస్కౌంట్లు, డీల్స్‌ను ప్రైమ్‌ ( Amazon Prime )చందాదారులు అందరికంటే ముందుగా పొందొచ్చు. అయితే, ఈ సేల్ ఆఫర్ ఎప్పుడు ముగుస్తుందన్న విషయాన్ని అమెజాన్ తెలపలేదు.

సమ్మర్ సేల్‌లో భాగంగా.. ఐసీఐసీఐ‌, వన్‌ కార్డ్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా డెబిట్‌కార్డు, క్రెడిట్‌కార్డుదారులకు పది శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ లభించనుంది. ఈఎంఐ కూడా ఉందని కంపెనీ తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది. ఫస్ట్ ఆర్డర్లపై ఫ్రీ డెలివరీతో పాటు వెల్‌కమ్ రివార్డు ద్వారా ఇరవై శాతం క్యాష్‌బ్యాక్ ఇవ్వనుంది. బట్టలు, స్మార్ట్ వాచీలు, బుక్స్, ఎలక్ట్రానిక్స్ పరికరాలపై భారీ ఆఫర్లు ఉండనున్నాయి. అమెజాన్‌ అలెక్సా డివైజ్‌, ఫైర్‌టీవీ, కిండ్లే డివైజ్‌లపై డిస్కౌంట్లు ఉండనున్నాయి. యాపిల్‌, శాంసంగ్‌, వన్‌ప్లస్‌, పోకో, హానర్‌, టెక్నో, రెడ్‌మీ, నార్జో, ఐక్యూ వంటి స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లు ఇస్తామని అమెజాన్ వెల్లడించింది. ఎంత డిస్కౌంట్ అనేది మాత్రం తెలపలేదు. త్వరలో దానికి సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయి. మార్కెట్‌లోకి కొత్తగా వచ్చిన స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందించే అవకాశం ఉంది.

వెబ్ స్టోరీస్