|| ప్రతీకాత్మక చిత్రం ||
భారతీయులందరికీ UIDAI జారీ చేసిన 12 అంకెల ఆధార్ కార్డు ఇప్పుడు వెబ్ సైట్ ద్వారా ఆధార్ PVC కార్డుని ప్రవేశపెట్టింది. ఈ PVC ఆధారిత కార్డు వల్ల సురక్షిత QR కోడ్ ఫోటోగ్రాఫ్, డెమోగ్రాఫిక్ వివరాలతో రక్షణ గల ఫీచర్ ని అందుబాటులో ఉంచుతుంది. సురక్షితమైన ఆధార్ PVC కార్డును ఎలా అప్లై చేయాలంటే.. అధికారిక వెబ్ సైట్ https://uidai.gov.in (or) https://resident.uidai.gov.in లాగిన్ చేయాలి. తరువాత మై ఆధార్ కార్డ్ సర్వీస్ లోని ఆర్డర్ ఆధార్ కార్డుని ఆప్షన్ పై క్లిక్ చేసి మీ 12 అంకాల ఆధార్ కార్డ్ నెంబర్ ని నమోదు చేసి క్యాప్చర్ కోడ్ ని కూడా నమోదు చేయాలి. ఒకవేళ మీ ఆధార్ నెంబర్ లో ఫోన్ నెంబర్ రిజిస్ట్రేషన్ అయి ఉంటే రిజిస్ట్రేషన్ అయిన ఫోన్ నెంబర్ ని ఉపయోగించాలి లేదా నా నెంబర్ రిజిస్ట్రేషన్ కాలేదు అని ఆప్షన్ ని క్లిక్ చేసి నెంబర్ ని నమోదు చేయాలి. తరువాత సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ ని క్లిక్ చేసి నిబంధనలు, షరతులు చెక్ బాక్స్ పై క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. తరువాత మేక్ పేమెంట్ పై క్లిక్ చేసి పేమెంట్ ని పూర్తి చేయాలి.
ఇలా పేమెంట్ వివరాలను పేమెంట్ పేజీలో పూర్తిచేసి డిజిటల్ సంతకంతో కూడిన రసీదును పొందవచ్చు. తరువాత పిడిఎఫ్ లో రశీదు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఆర్డర్ ఆధార్ కార్డ్ రిక్వెస్ట్ ని సర్వీస్ నెంబర్ వివరాలను మీ మొబైల్ నెంబర్ కు ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇలా అప్లై చేసిన తర్వాత ఐదు పని రోజుల్లో UIDAI ముద్రించిన పోస్ట్ ఆఫీస్ కు మీ ఆధార్ PVC కార్డు అందుతుంది. ఏదైతే మీ ఆధార్ కార్డులో నమోదు చేసిన అడ్రస్ ప్రకారం డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ డెలివరీ నిబంధనల ప్రకారం ఆధార్ PVC కార్డ్ మీకు అందుతుంది.
