ఆదిలాబాద్ టు హైదరాబాద్.. బహుముఖ ప్రజ్ఞాశాలి ఈ చిన్నారి షణ్ముఖ్

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||షణ్ముఖ్||

(ఈవార్తలు, రంగారెడ్డి ప్రతినిధి, అక్కినేపల్లి పురుషోత్తమరావు)

పిట్ట కొంచెం కూత గనం అనే సామెతను నిజం చేస్తూ ఫ్యాషన్, నాటకం, బుల్లితెర, వెండితెర, చిత్ర (ఆర్ట్) రంగాలలో దూసుకుపోతున్నాడు కోన షణ్ముఖ్. సురేష్, ఆశాలత దంపతులకు జన్మించిన షణ్ముఖ్.. తనకంటూ ఒక ప్రతిభను చాటుకుంటూ తన ప్రతిభ ముందు మరేదీ సాటి రాదు అంటూ సరిలేరు నాకెవ్వరు అనే విధంగా ఆ చిన్నారి తన జీవితాన్ని అనేక మలుపులు తిప్పుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆదిలాబాద్ లాంటి గిరిజన నివాస ప్రాంతం నుండి భాగ్యనగరానికి వచ్చి మియాపూర్ దీప్తి నగర్ లో చిరు ఉద్యోగం చేసుకుంటున్న నరేష్ ఆశాలత కుమారుడు షణ్ముఖ్.. మదీనాగూడాలోని శ్రీనిధి గ్లోబల్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. ఒకవైపు మోడలింగ్ మరోవైపు యాడ్స్ (ప్రకటనలు) లో నటిస్తూ మరో కోణం చిత్రలేఖనంతో తన కుంచెకు పదును పెడుతూ మల్టీ టాలెంటెడ్ కిడ్ గా ఎందరో విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు. నిరుపేద కుటుంబానికి వచ్చి ఏదో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్న తల్లిదండ్రుల కలలు నెరవేర్చాలని తన ప్రతిభతో పలువురు చిన్నారులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఒక మూడు గంటలు సినిమా హాల్లో కూర్చుని సినిమా చూడడం తేలికైన పని నటించడం ఎంత కష్టమో! బొమ్మలు గీయడం కూడా అంతే, చూసేందుకు గీసిన బొమ్మలన్నీ అందంగానే ఉంటాయి కానీ బొమ్మ గీయాలి అంటే కాన్వాస్ పై కుంచె పెడితే కొంచెం కూడా కదలదు. కానీ అలాంటిది అటు కెమెరా ముందు ఇటు కాన్వాస్ పై మరోవైపు నాటక రంగం బుల్లితెర వెండితెరలపై తన ప్రతిభను కనబరుస్తున్నాడు కోన షణ్ముఖ్.

చిన్నతనం నుండి అతనిలో ఉన్న ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు అతని అడుగులు ఆ వైపు పడేటట్టు బాటలు వేశారు. "కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహా పురుషులవుతారు తరతరాలకే తరగని వెలుగవుతారు"అన్న కవి మాటలు నిజం చేస్తూ కృషి పట్టుదల తన ఆయుధంగా చేసుకుని ఆపిల్, అమెజాన్ ఇంటీరియర్ డెకరేషన్ రియల్ ఎస్టేట్ లాంటి రంగాలలో ప్రకటనలలో నటించి తన ప్రతిభ ను పదిమందికి ప్రదర్శిస్తున్నాడు ఒకవైపు చిత్రలేఖనం మరోవైపు బుల్లితెర, వెండితెర వేటిని వదలకుండా వేసవి సెలవులలో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ వారు నిర్వహించిన నాటిక పోటీలలో బహుముఖ ప్రజ్ఞ కనపరుస్తూ రోజురోజుకు తన ప్రతిభకు పదును పెడుతున్నాడు. పెన్ అప్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా భాగ్యనగరంలో జరిగిన అల్మారా ఇంటర్నేషనల్ ఫ్యాషన్ షోలో పాల్గొని ప్రథమ స్థానం దక్కించుకున్నాడు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఫ్యాషన్ వైపు అడుగులు వేసే అవకాశం దక్కించుకున్నాడని గర్వంగా చెబుతాడు షణ్ముఖ ఎలాంటి ఫ్యాషన్ చిత్ర రంగ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన షణ్ముఖ వెండితెరపై బాల నటుడిగా అవకాశాలు చేజిక్కించుకుంటూ రాణిస్తున్నాడు. గ్లామర్ ఏరా పత్రిక కోసం పనిచేయడంతో పాటు ఇండియన్ కిడ్ ఫ్యాషన్ వీక్షోలో ర్యాంపు వాక్కులో తన ప్రతిభ కనపరిచాడు.

ప్రతిభకు అవార్డులు

షణ్ముఖ్ ప్రదర్శించిన అనేక ప్రదర్శనలకు ప్రతీకగా ఎన్నో అవార్డులు రివార్డులు అతనిని వరించాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో ప్రతిష్టాత్మకమైన తుమ్మలపల్లి కళాక్షేత్రం లలిత కళా సేవా సమితి వారు షణ్ముఖను స్టార్ మోడల్గా సత్కరించారు. భాగ్యనగరంలోని సివి రామన్ అకాడమీ వారు సూపర్ మోడల్ సకల కళా ఫౌండేషన్ వారు నంది అవార్డు నాటా ఫౌండేషన్ వారు ఉగాది పురస్కారంతో ఆర్కే ఫౌండేషన్ వారు స్టార్ అవార్డుతో సత్కరించారు షణ్ముఖ అటు ఫ్యాషన్ షోలో అలరిస్తూనే బొమ్మలు గీయడం ప్రతిభను చాటడం చేస్తూనే బుల్లితెర వెండితెరలపై బాల నటుడిగా అలరిస్తున్నారు అతనినాణానికి మరో కోణం డబ్బింగ్ అనేక బుల్లితెరలలో చిన్న చిన్న పాత్రలకు డబ్బింగ్ చెబుతూ నాకెవ్వరూ సాటి లేరు అని నిరూపించుకుంటూ నే వెండితెరపై బాల నటుడిగా అలరిస్తున్నారు ఇంతవరకు అమరం అఖిలం, ఈ ప్రేమ, బాక్సాఫీస్, విలన్ చిత్రాలలో బాల నటుడిగా నటించి వెండితెరపై తన ప్రతిభను ప్రదర్శించాడు ఎలాంటి సినిమా పరిశ్రమ ప్రయత్నాలు చేయకుండా సినీ పరిశ్రమ తనకు అవకాశం కల్పించడం ఆయన ప్రతిభకు నిదర్శనం.

ఎన్నో నాటకాలు తన ప్రతిభకు గీటురాళ్లు

చిన్నారి షణ్ముఖ రవీంద్ర భారతి త్యాగరాయ గాన సభ లాంటి ప్రతిష్టాత్మక వేదికలపై ఎన్నో నాటకాలలో నటించి "భళా"అనిపించుకున్నాడు కొద్ది రోజుల క్రితం తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ నిర్వహించిన కర్ణ భారం నాటికలో నటించి కేవలం ఆన్లైన్లో శిక్షణ పొంది అత్యంత ప్రతిభను కనబరిచారు. రంగస్థల దర్శకులు రమేష్ కిషన్ గౌడ్ నేతృత్వంలో నటించిన ఈ నాటకంలో ప్రతిభ కనబరిచిన షణ్ముఖను తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ప్రత్యేకంగా ప్రశంసించడం ఒక రికార్డు. అదేవిధంగా నగరంలోని రవీంద్ర భారతి వేదికపై ఏక చక్రం అనే ఆంగ్ల నాటకాన్ని చిన్నారులు అద్భుతంగా ప్రదర్శిస్తే ఆ నాటికలో షణ్ముఖ ప్రదర్శించిన నట కౌశలం నాటక రంగాలలో ఇప్పుడిప్పుడే రాణిస్తున్న చిన్నారులకు స్ఫూర్తిదాయకం.

తన ప్రతిభను ప్రదర్శించేందుకు ఎంతో మంది పెద్దలు తనకు సహకరించారని వారందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని షణ్ముఖ మా ప్రతినిధికి తెలిపారు. తాను చదువుకునే పాఠశాల శ్రీనిధి గ్లోబల్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీదేవి దర్శకులు ఫాతిమా కష్ కష్ ఫాతిమా అంబర్ పాటక్ సలీం ఇలాహీ(కసి ఖాన్ మోడలింగ్) గురువు, వినోద్ కుమార్ శ్రీదేవి నాయుడుకి రమేష్ కిషన్ గౌడ్ కి తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు. షణ్ముఖ లాంటి వండర్ కిడ్ ఎన్నో అవకాశాలు పునికి పుచ్చుకొని భవిష్యత్తు తరాల యువకులాకారులకు ఒక పెద్ద బాలశిక్ష కావాలని మరిన్ని అవకాశాలు అతని ఇంటి తలుపు తట్టాలని మనము కోరుకుందాం.

వెబ్ స్టోరీస్