ఇంటి వాస్తు అనేది అందరికి చాలా ముఖ్యమైనది. అలాగే ఇంటి లోపల అమర్చుకునే వస్తువులు కూడా వాస్తు ప్రకారం పెట్టుకుంటే మంచిది అని పండితులు చెబుతున్నారు. అందులో ముఖ్యమైనది అద్దం. ఒక అద్దం మానవ జీవితన్నే మార్చేస్తుంది అని చాలా మంది అంటుంటారు. అద్దం ఏ విధంగా పెట్టుకోవాలి, ఏ దిక్కున పెట్టుకోవాలి, ఎలాంటి అద్దాలు ఇంట్లో ఉండాలి అలాగే డ్రెస్సింగ్టే బుల్స్ ఇంట్లో ఉండవచ్చా? ఉండరాదా? అద్దాలు ఏవిధంగా ఉంటే బాగుంటుంది? అనే విషయం తెలుసుకుందాం.
ప్రతీకాత్మక చిత్రం

చాలా మంది అద్దాలును తెలియక పొడువుగా ఉండేవి కానీ చతురస్రం ఆకారం లాంటివి కానీ పెడుతుంటారు. అయితే అవి అన్ని చోట్ల మంచివి కావు. ఒకే ఆకారం లాంటి అద్దం ఇంట్లో ప్రతిచోట ఉంచడం మంచిది కాదు. పొరపాటున కూడా ఉత్తరం వైపు చతురస్రం ఆకారపు అద్దం పెట్టకూడదు. అలా కాకుండా ఉత్తరం వైపు గుడ్రంగా ఉండే అద్దాన్ని పెట్టుకోవాలి చెబుతుంది శాస్త్రం. ఎందుకు అంటే గృహం మొత్తం పంచముఖ సంబందంగా ఉంటుంది. అగ్ని, భూమి, వాయువు, జలం, ఆకాశం తత్వాలతో నిండి ఉంటుంది. దీనికి ఒక్కో వైపు ఒక్కో సపోర్టివ్ రిలేటెడ్‌తో ఆకారం అనేది ఉంటుంది. ఒక్కో ఆకారాన్ని బట్టి ఒక్కో తత్వం ఉంటుంది.
తూర్పు వైపు పెట్టే అటువంటి అద్దాలను దీర్ఘచతురస్రం ఆకారపు అద్దాన్ని పెట్టుకోవాలి. అంటే పొడువుగా ఉండే అద్దాలు. ఇలా పెట్టుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. సోషల్ కమ్యూనికేషన్స్ పెరుగుతాయి. మనం సొసైటీలో చేసే పనులు మంచి ఫలితాలను ఇస్తాయి. ఇంటికి పూర్తిగా తూర్పువైపుగానూ, లేదా ఉత్తరం వైపు అద్దాన్ని పెట్టుకోవచ్చు. కొందరు ఇంట్లో ఉన్న అన్ని గదుల్లోనూ అద్దాలను అమర్చుకుంటారు. కానీ ఏ గదిలో ఎలాంటి అద్దం, ఏ ఆకారపు అద్దం పెట్టుకోవాలి అని తెలీక ఇష్టం ఉన్నట్లు పెట్టుకుంటారు. అలా చేయడం వల్ల ఆ ఇంటికి కీడు సంభవిస్తుంది. ఏ గదిలో అయితే అద్దం పెడుతామో ఆ గదికి తూర్పు వైపున గానీ లేదా ఉత్తరం వైపున గానీ పెట్టుకోవాలి అని వాస్తు శాస్రం చెబుతుంది. కొందరు అద్దాలను బాత్రూమ్‌లో కూడా పెడుతుంటారు. మరీ పెద్ద పెద్ద అద్దాలను బాత్రూమ్‌లో పెట్టుకోకూడదు.