vastu tips | వంటింటిలో ఉండే రోలు, రోకలి ఎక్కడ పెట్టాలి.. వాటి ఫలితాలేంటి..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



|| ప్రతీకాత్మక చిత్రం ||

ఇంట్లో వస్తువులు ఎలాంటి ప్రదేశాల్లో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది వాస్తు శాస్త్రంలో పూర్తిగా వివరించబడింది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలో వంటగది ఇంటి యొక్క పరిస్థితులను, ఇంట్లో వారి ఆరోగ్య స్థితులపై ప్రభావం చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంటిలో వంటగది ఆగ్నేయంలో లేదా వాయువ్యంలో నిర్మించుకోవడం ఉత్తమం. అయితే వంటింటిలో వాడుకునే వస్తువులు కూడా ఇంట్లో మనుషుల మధ్య భార్యాభర్తల మధ్య ఎలాంటి ప్రభావం చూపిస్తుందో వాస్తు శాస్త్రంలో వివరించబడింది. ఇంట్లో ఉండే రోలు, రోకలి ఎటువైపు ఉండాలి దానివల్ల ఏర్పడే ఫలితాలు ఏంటో తెలుసుకుందాం..

ఇంట్లో రోలు రోకలి ఈశాన్య దిశలో ఉంచడం మంచిది. 

రోలు రోకలి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.

రోలు సమీపంలోనే రోకలి పెట్టాలి వాటిని ఎప్పుడు విడదీసి పెట్టకూడదు. 

రోకలిని భూమికి ఆనుకొని పడుకోబెట్టకూడదు నిలుచోబెట్టాలి.

రోలు రోకలి విడివిడిగా పెట్టడం వలన భార్యాభర్తల్లో అన్యోన్యత లోపించి గొడవలు ఏర్పడతాయి. 

రోలు రోకలి ఎట్టి పరిస్థితుల్లోనూ పడమర దక్షిణ దిశల్లో ఉంచకూడదు ఇలా ఉంచడం వల్ల ఇంటి ఆర్థిక స్థితి పై ప్రభావం పడుతుంది. 

మంచి నీటితోనే రోలును కడగాలి. తడి బట్టలతో చూడకూడదు.

తోలు కడిగే ఎప్పుడు ఎలాంటి పౌడర్, సబ్బులు ఉపయోగించకూడదు.

విరిగిన పాడైపోయిన రోలును ఇంటిలో ఉంచుకోకూడదు.

రోలు బోర్లించి పెట్టకూడదు. ఇలా చేయడం వలన ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనుకోకుండా రోలు బోర్లించినట్లయితే ఆ రోలును మరల ఉపయోగించకూడదు. కొత్తది మాత్రమే కొనుక్కొని ఉపయోగించాలి. 

రాయి రోలును ఉపయోగించడం మంచిది. ఒకవేళ రాయి రోలు విలుకనట్టైతే, వేప చెక్కతో చేసిన రోలు ఉపయోగించడం మంచిది. 

వేప రోలు వలన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది సుఖసంతోషాలతో జీవిస్తారని నమ్మకం.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్