||ప్రతీకాత్మక చిత్రం||
Meteorological News | వర్షాకాలం వచ్చిందంటే చాలు వానలు పడగానే వాతావరణ శాఖ ఆరెంజ్, ఎల్లో, రెడ్ అలర్ట్ అంటూ ప్రకటన చేస్తుంది. అసలు ఈ హెచ్చరికలు ఏంటి? వీటిని ఏ టైంలో జారీ చేస్తారు? ఈ రంగులు దేన్ని సూచిస్తాయి? అన్నది చాలా మందికి తెలియదు. వాతావరణ పరిస్థితులను సూచించేందుకు వాతావరణ శాఖ ఈ కలర్ కోడ్స్‌ను జారీ చేస్తుంది.
బ్లూ అలర్ట్: ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంటే వాతావరణ శాఖ బ్లూ అలర్ట్ జారీ చేస్తుంది.
ఎల్లో అలర్ట్: వర్షాలు కురిసే పరిస్థితులు ఉంటే ప్రజలను అప్రమత్తం చేసేందుకు వాతావరణ శాఖ దీన్ని జారీ చేస్తుంది. 64.5 మిల్లీమీటర్ల నుంచి 115.5 మిల్లీ మీటర్ల మధ్య వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నప్పుడు ఎల్లో అలెర్ట్ జారీచేస్తారు.
ఆరెంజ్ అలర్ట్: 115.6 నుంచి 204.4 మిల్లీమీటర్ల మధ్య వర్షపాతం నమోదైతే ఆరెంజ్ అలర్ట్ జారీచేస్తారు. వర్షాల వల్ల రోడ్లు, రవాణా, విమానాల రాకపోకలకు అంతరాయం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగే అవకాశాలుంటే ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తారు.
రెడ్ అలర్ట్: 204.5 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటే రెడ్ అలర్ట్ జారీ చేస్తారు. సహజంగా తుఫాన్లు వచ్చినప్పుడు, 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ, అతి భారీ వర్షాలు కురుస్తాయనే అంచనా ఉంటే దీన్ని అమలు చేస్తారు.