సరికొత్తగా వాట్సాప్‌.. అందుబాటులోకి వచ్చిన మరో ఐదు కొత్త ఫీచర్లు.!

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది వినియోగిస్తున్న వాట్సాప్‌లో ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు వచ్చి చేరుతున్నాయి. మెటా యాజమాన్యంలోని ఈ యాప్‌కు కోట్లాది మంది యూజర్లు ఉన్నారు. ఈ క్రమంలోనే యూజర్ల ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపర్చేందుకు మరికొన్ని కొత్త ఫీచర్లను వాట్సాప్‌ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. కొత్తగా తీసుకువచ్చిన ఫీచర్లు వినియోగదారులకు మరింత ఉపయుక్తంగా ఉంటాయని మెటా యాజమాన్యం పేర్కొంది. వాట్సాప్‌ వినియోగదారుల గోప్యత, భద్రతను మెరుగుపరిచేలా ఈ ఫీచర్లను తీసుకువచ్చినట్టు వెల్లడించింది.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది వినియోగిస్తున్న వాట్సాప్‌లో ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు వచ్చి చేరుతున్నాయి. మెటా యాజమాన్యంలోని ఈ యాప్‌కు కోట్లాది మంది యూజర్లు ఉన్నారు. ఈ క్రమంలోనే యూజర్ల ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపర్చేందుకు మరికొన్ని కొత్త ఫీచర్లను వాట్సాప్‌ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. కొత్తగా తీసుకువచ్చిన ఫీచర్లు వినియోగదారులకు మరింత ఉపయుక్తంగా ఉంటాయని మెటా యాజమాన్యం పేర్కొంది. వాట్సాప్‌ వినియోగదారుల గోప్యత, భద్రతను మెరుగుపరిచేలా ఈ ఫీచర్లను తీసుకువచ్చినట్టు వెల్లడించింది. తాజాగా తీసుకువచ్చిన ఫీచర్లతో యాప్‌ మరింత సౌకర్యవంతగా ఉండనుంది. అవేంటన్నది పరిశీలిస్తే.. వాట్సాప్‌లో యూజర్లు తమకు నచ్చినట్టుగా కస్టమైజ్‌ చేసుకునేందుకు వాట్సాప్‌ చాటింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ను ఇంప్రూవ్‌ చేసుకునేందుకు చాట్‌ థీమ్‌ స్పెసిఫికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో యూజర్లు నచ్చిన కలర్‌లో చాట్‌ను సెట్‌ చేసుకోవచ్చు. మొన్నటి వరకు చాట్‌ స్ర్కీన్‌ థీమ్‌ కేవలం ఒకే రంగులో ఉండేది. అవతలి యూజర్స్‌ పంపే సందేశాలు కేవలం వైట్‌ కలర్‌లో కనిపించేవి. యూజర్‌ సెండ్‌ మెసేజ్‌ మాత్రం గ్రీన్‌ కలర్‌లో ఉండేవి. మిగిలిన ప్లాట్‌ఫామ్స్‌లో ఇలాంటి చాట్‌ థీమ్స్‌ మార్చుకునే అవకాశం ఉంది. తాజాగా వాట్సాప్‌ కూడా కస్టమైజ్డ్‌ ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. అలాగే, నోటిఫికేషన్‌ను నియంత్రించే సదుపాయాన్ని తీసుకువచ్చింది. వాట్సాప్‌లో కుప్పలు తెప్పలుగా మెసేజ్‌లు వస్తుంటాయి. యూజర్లు చదవని మెసేజ్‌లకు సంబంధించిన నోటిఫికేషన్‌ డాట్‌ కారణంగా చిరాకుపడుతుంటారు. చదవకుండా వదిలేసిన మెసేజ్‌ సమస్యను అధిగమించేందుకు క్లియర్‌ చాట్‌ నోటిఫికేషన్‌ ఫీచర్‌ను జోడించింది.

యూజర్లు నోటిఫికేషన్‌ సెట్టింగ్స్‌కు వెళ్లి తమకు నచ్చినట్టుగా నోటిఫికేషన్‌లో మార్పులు చేసుకోవచ్చు. గతేడాది పరిచయం చేసిన ఫిల్టర్‌కు తాజాగా చాట్‌ కౌంటర్‌ ఫీచర్‌ను యాడ్‌ చేసింది. దీంతో యూజర్లు చాట్‌ ఫిల్టర్‌లో ఎన్ని మెసేజ్‌లు చదవనివి ఉన్నాయో నేరుగా తెలసుకోవచ్చు. తద్వారా ముఖ్యమైన మెసేజ్‌ మిస్‌ కాకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. అలాగే, వీడియో ప్లేబ్యాక్‌ స్పీడ్‌ సర్దుబాటు ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. గతంలో ఈ ఫీచర్‌ను వాయిస్‌ నోట్స్‌ కోసం మాత్రమే అందుబాటులో ఉండేది. ప్రస్తుతం వేగంగా వీడియోలను చూసుకునేందుకు అవకాశాన్ని కల్పించింది. వాట్సాప్‌లో షేర్‌ చేసిన వీడియోలను త్వరగా చూడాలనుకునే యూజర్లు ప్రత్యేకంగా ఇది ఉపయోగపడుతుంది. వాట్సాప్‌లో మెటా ఏఐ చాట్‌బాట్‌ను వాట్సాప్‌ పరిచయం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఏఐను మరింత లోతుగా అనుసంధానిస్తోంది. యూజర్లు ఇప్పుడు వారి ఫోన్‌ హోమ్‌ స్ర్కీన్లకు మెటా ఏఐ విడ్జెట్‌ను జోడించవచ్చు. వాట్సాప్‌ ఏఐ చాట్‌ బాట్‌కు ఇన్‌స్టంట్‌ యాక్సెస్‌ ఇస్తుంది. ఇందుకోసం పర్సనలైజేషన్‌ ఓపెన్‌ చేసి విడ్జెట్‌ కేటగిరీలోకి వెళ్లాల్సి ఉంటుంది. అందులో హోమ్‌ స్ర్కీన్లకు మెటా ఏఐ విడ్జెట్‌ను జోడించుకోవచ్చు. దీంతో కేవలం ఒకే ఒక్క ట్యాప్‌తో మెటా ఏఐ చాట్‌ బాట్‌ ఓపెన్‌ అయ్యి యూజర్లకు సహాయం చేస్తుంది. వాట్సాప్‌లో కొత్తగా వచ్చిన ఈ ఫీచర్లను మీరూ ట్రై చేయండి మరి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్