Law Tip : ఎఫ్ఐఆర్ అంటే ఏమిటి.. కోర్టులో దాని విలువ ఎంతో తెలుసా?

ఎఫ్ఐఆర్ అంటే.. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (First Information Report). తెలుగులో ప్రథమ సమాచార నివేదిక అంటారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 154 ప్రకారం (Under Section 154 of criminal Procedure code) పోలీస్ అధికారి నమోదు చేసే సమాచార నివేదిక.

first information report
ప్రతీకాత్మక చిత్రం

ఎఫ్ఐఆర్ అంటే.. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (First Information Report). తెలుగులో ప్రథమ సమాచార నివేదిక అంటారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 154 ప్రకారం (Under Section 154 of criminal Procedure code) పోలీస్ అధికారి నమోదు చేసే సమాచార నివేదిక. ఈ నివేదికలో కేసుకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఉంటాయి. ఫిర్యాదు చేసింది ఎవరు? ఈ నివేదిక తయారు చేసింది ఎవరు? ఏ నేరం జరిగింది? ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది? నేరం ఎవరు చేశారు? నేరం జరుగుతున్నప్పుడు చూసింది ఎవరు? గాయపడినవారు ఎవరు? చనిపోయినవారు ఎవరు? మొదలైన వివరాలు ఇందులో ఉంటాయి. ఎఫ్ఐఆర్‌ను ఎవరైనా దాఖలు చేయవచ్చు. తప్పనిసరిగా బాధితుడో, గాయపడినవారో, ప్రత్యక్ష సాక్షి కానవసరం లేదు.

నేరం జరగగానే పైన చెప్పిన వివరాలు అన్నీ రాసి పోలీస్ స్టేషన్‌లో అందజేయాలి. ఆ ఫిర్యాదును పోలీసులు తీసుకొని ఎవరు తెచ్చి ఇచ్చారు? ఏ సమయంలో అది వారికి చేరిందో రాసుకొని దాన్ని వేరే నివేదికగా తయారు చేసి వెంటనే మేజిస్ట్రేటుకు అందజేస్తారు. దీన్నే ఎఫ్ఐఆర్ అంటారు. దానిపై సదరు ఇన్‌స్పెక్టర్ సంతకం చేయాలి. ఇది ప్రమాదకరమైన నేరాల విషయంలో స్వయంగా మేజిస్ట్రేటుకు ఆందజేయాలి. మామూలు నేరాల విషయంలో అయితే కోర్టుకు అందజేయవచ్చు. 

ఫిర్యాదు ఒకసారి పోలీస్ స్టేషన్‌కో, మేజిస్ట్రేట్‌కో చేరాక మార్చటానికి వీలు ఉండదు. ముద్దాయిలను కొత్తగా చేర్చడం, సాక్షులను కలపడం, నేరం జరిగిన స్థలం, సమయం మార్చడానికి వీలుండదు. ఎఫ్ఐఆర్‌లో పేరు లేకపోతే వెంటనే బెయిల్ దొరుకుతుంది. నేరానికి సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ అందులో ఉంటాయి కాబట్టి ఇది చాలా ముఖ్యమైన పత్రం. సమాచారాన్ని ఇచ్చిన లేదా ఫిర్యాదు చేసిన వ్యక్తికి పోలీసులు నమోదు చేసిన సమాచారాన్ని చదవాలని అడిగే హక్కు ఉంటుంది. సమాచారాన్ని పోలీసులు నమోదు చేసిన తర్వాత దానిపై సమాచారం ఇచ్చిన వ్యక్తి సంతకం చేయాలి. ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు పోలీసులు నిరాకరిస్తే సీఆర్‌పీసీ సెక్షన్‌ 200 కింద సంబంధిత మెజిస్ట్రేట్‌ ముందు ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేసుకోవచ్చు.

వెబ్ స్టోరీస్