Vastu tips| ఇంటికి గార్డెన్ ఎటు వైపు ఉండాలి.. మెటల్ ఫర్నీచర్ వల్ల ప్రభావాలు ఏంటి అంటే..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||ప్రతీకాత్మక చిత్రం||

కొత్త ఇంటిని నిర్మించుకోవాలంటే అనేక రకాలైన నియమాలను కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇంటి ముఖ ద్వారం ఏ వైపు ఉండాలి, ఇంటి గది ఆకారాలు ఎలా ఉండాలి, వెంటిలేషన్ ఎక్కడ పెట్టుకోవాలి, గార్డెన్ ఎటువైపు ఏర్పాటు చేసుకోవాలి, ఇంటిని ఏ విధంగా అలంకరించుకోవాలి, వాటర్ ట్యాంక్ నల్లలు ఎటువైపు ఉంటే మంచిది, పూజా గదిని ఎలా, ఎక్కడ ఉండాలి. ఇలా వాస్తు శాస్త్రం తో పాటు నియమాలను తెలుసుకొని ఇంటిని నిర్మించుకోవాల్సి వస్తుంది అయితే వీటిని ఎలా నిర్మించుకుంటే మంచిది. ఎలాంటి వాతావరణం నెలకొంటుంది వీటివల్ల అని తెలుసుకుందాం..

ఇంటిని నిర్మించుకునేందుకు ఇంటి కాలి స్థలం చతురస్రాకారం లేదా దీర్ఘ చతురస్రమాత్రమే ఉండాలి. ఇంటి నిర్మాణానికి ప్రవేశద్వారం తూర్పు లేదా ఉత్తరం దిశగా ఉండాలి. తూర్పు దిశగా ప్రవేశద్వారం ఉండటం వలన బలాన్ని మరియు వేడుక యొక్క భావాన్ని కలిగిస్తోంది. అలాగే సూర్యకిరణాలు ఇంటి లోపల పడి ఆహ్లాదకరమైన వాతావరణ అందిస్తోంది. ఉత్తరం వైపు ముఖ ద్వారం ఉండటం వల్ల శక్తి స్థాయిలు పెరిగి కుటుంబ సభ్యులకు అదృష్టాన్ని అందజేస్తుంది. దక్షిణం మరియు పడమర దిక్కున ముఖ ద్వారం ఉండటం వలన అశుభము. 

ఇంటిలోని గదుల ఆకారం చతురస్రం లేదా దీర్ఘ చతురస్రం L ఆకారంలో ఉండడం మంచిది. దీర్ఘ చతురస్రాకారపు గది పొడవు వెడల్పు కంటే రెండు రేట్లు మించకుండా ఉండేందుకు చూసుకోవాలి. ఇలా కాకుండా ఆకారము లేని గదులను నిర్మించడం వలన వాస్తు దోషాలు ఏర్పడతాయి. 

ఇంటి యొక్క వెలుతురు ఇంటి తేజస్సుపై కీలక పాత్ర పోషిస్తుంది. గాలి ఇంటి లోపల విస్తృతమైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవడం అన్ని వైపుల నుండి గాలి సహజ కాంతులు ఇంటి లోపలికి ప్రవేశించేలా ఏర్పాటు చేసుకుంటే అనుకూలమైన శక్తులు కలిగి ఉంటుంది. వెలుతురు లేని గదుల వలన నిరుత్సాహం మొదలవుతోంది. ఇంటిలోని అన్ని గదులను శుభ్రం చేసుకొని వాటిని ఎప్పుడు వాడుకలో ఉంచుకోవాలి. తాళాలు పెట్టి అలా వదిలేయకూడదు. 

ఇంటిలో గార్డెన్ ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యం. కానీ ఈ గార్డెన్ లో కొన్ని మొక్కలు మాత్రమే ఉంచుకోవాలని చెపుతుంది వాస్తు శాస్త్రం. ఇంటిలో నిర్మించుకునే గార్డెన్ లో అరెకా పామ్, మనీ ప్లాంట్, పీస్ లిల్లీ, లక్కీ వెదురు, పవిత్రమైన తులసి, పుష్పించే మొక్కలు అవి స్థలాన్ని ఆహ్లాదకరంగా మార్చేందుకు ఉపయోగపడతాయి. 

ఇంటి గదులను అలంకరించుకునేందుకు ప్రతి ఒక్కటి ప్రశాంతంగా, ఆనందాన్ని ఆహ్లాదకరంగా ఉండే వాటిని మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ప్రకృతిని ప్రేరేపించేలా పెయింటింగ్ చిత్రాలను పటాలను బొమ్మలను ఏర్పాటు చేసుకుంటే మంచిది. కానీ, యుద్ధము సంఘర్షణ లాంటివి ఇంట్లో ఏర్పాటు చేసుకోవడం వలన కష్టాలకు దారితీస్తుంది. లాఫింగ్ బుద్ధ ఇంటిలో ఉంచుకోవడం వలన దానిని చూసినప్పుడు మనలో ఒక చిరునవ్వు రావడంతో పాటు ఇంట్లో సంపద ఆయుష్షు, శ్రేయస్సు పెరుగుతోంది. 

ఇంటిలో సామానులు ఎప్పుడైనా మనుషులు తిరగడానికి వీలు ఉండేలా మాత్రమే ఏర్పరుచుకోవాలి అంటే ఒక సైడ్ కు మార్చుకుంటే మంచిది. ఇంటిని ఎప్పుడైనా పరిశుభ్రంగా ఇంటికి వచ్చిన వారికి ఆహ్లాదకరంగా కనిపించేలాగా శుభ్రంగా ఉంచుకోవాలి. 

ఇంటిలో విచ్చినం, లీకేజీలు, వదులుగా ఉండే అమరికలను జాగ్రత్తగా బాగుచేసుకోవాలి. ఇలా లీకేజ్, వదులుగా, విచ్చినమైన వస్తువులు ఇంట్లో ఉంచితే అనవసరంగా డబ్బులు కోల్పోవాల్సి వస్తుంది. అలిగిన అద్దాలు, ఆగిపోయిన గడియారాలు ఇంట్లో ఉంచుకోకూడదు. తలుపులను కిటికీలను ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో దుమ్ము ధూళి చేరకుండా శుభ్రంగా ఉంచుకుంటే అనుకూల శక్తులు ఇంట్లో ఉంటాయి లేదా దుష్టశక్తులు ప్రవేశించే అవకాశం ఉంటుంది.

పూజగది ఎప్పుడు ఇంట్లో అంతటికి ముఖ్యమైనది. పూజ గది ఎల్లప్పుడు తలుపులు రెండు ఉండాలి ఒకే తలుపు పనిచేయదు. పూజ గదిలో సీలింగ్ తక్కువగా ఉండి వైబ్రేషన్స్ ప్రసారమయ్యేలా చూసుకోవాలి. పూజ గది ఎట్టి పరిస్థితుల్లోనూ టాయిలెట్ పక్కన లేదా మెట్ల కింద ఉండకూడదు. పూజ గదిలో ఎక్కువ చెక్క, రాగి, ఇత్తడి వస్తువులు ఉపయోగించాలి. ఇంట్లో పూజ గదిలో మెటల్ ఫర్నిచర్ వాడకుండా ఉంటే మంచిది. 

ఇంటిలో మెటల్ ఫర్నిచర్ వాడటం వలన ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఇంటిలో సింగిల్ బెడ్ మాత్రమే ఉండేలాగా చూసుకోండి. ఒకవేళ డబుల్ బెడ్ ఉన్నా కానీ, సింగిల్ పరుపు ఉండేలాగా చూసుకోవాలి. పడకగదిలో ఎట్టి పరిస్థితుల్లో ఇనుప మంచం, అద్దం లేకుండా చూసుకోవాలి.  

ఇంటి గోడలకు ఒకే రకమైన రంగులు ఎంచుకోవడం మంచిది ఆర్కిటెక్చర్ సలహాలతో డిజైన్లు సౌందర్యంగా కనిపించేందుకు రకరకాలుగా ఏర్పాటు చేసుకోవడం వలన వాస్తు ప్రకారం ఇది మంచిది కాదు. 

ఇంటి యొక్క బీములు ఎప్పుడు గోడలు అమ్మర్చుకునే విధంగా ఉండాలి. ఒకవేళ లేకపోతే బీముల కింద ఎప్పుడు కూర్చోకూడదు, పడుకొకూడదు. ఇలా చేసినట్లయితే అస్థిరమైన నిద్ర, ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. పైన సలహాలు వాస్తు శాస్త్రం చెబుతోంది. వీటిని అనుసరించడం వలన మంచి జరుగుతుందని నమ్మకంతో ఉండటం మంచిది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్