Vasthu Tips : ఇంటికి ఏ దిక్కున తలుపులు కిటికీలు ఉంటే ఏం జరుగుతుందో తెలుసా?

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||ప్రతీకాత్మక చిత్రం||


వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని నిర్మించుకోవడం జరుగుతుంది. అయితే ఇంటిలో గదులు, గదుల యొక్క కిటికీలు, ద్వారాలు సరి సంఖ్యలో ఉండేలా చూసుకోవాలని వాస్తు శాస్త్రం చెబుతుంది. అయితే ఇంటికి ఉండే ముఖద్వారం ఎటు వైపు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో.. నామరాశిని బట్టి లేదా నామక్షర వర్గాలను అనుసరించి గృహ వైశాల్యం వల్ల ఏ దిశలో సింహద్వారం ఉంచాలో వాస్తు శాస్త్రం తెలుసుకొని నిర్ణయించడం జరుగుతుంది. ముఖ్యంగా ముఖద్వారం తూర్పు దిశగా లేదా తూర్పు ఉత్తర దిశల్లోనూ.. తూర్పు పడమర ఉత్తరం లేదా నాలుగు వైపులా ముఖ ద్వారం ఉండడం మంచిది. అయితే ఏ వైపు ముఖద్వారం ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం.. 

ఏకద్వారం:

ముక్కు ద్వారం ఇంటి మొత్తానికి ఒకటే ఉంటే.. అంటే ఇంటిలోకి వచ్చే దారి ఇంటి మొత్తానికి ఒకటే ఉంటే..

తూర్పున : ధనవృద్ధి, 

దక్షిణ దిశ : జయం, 

పడమట ధనహాని, 

ఉత్తర దిశ : ధన నష్టం.

రెండు ద్వారాలు :

తూర్పు - దక్షిణ దిశలు : కళత్ర పీడ, 

తూర్పు-పడమర :  పుత్రవృద్ధి, 

దక్షిణ, పడమరలు : ద్రవ్యలాభం, 

తూర్పు, ఉత్తర : కష్టనష్టాలు, 

ఉత్తర, దక్షిణాలు : శత్రుభయం, 

ఉత్తర, పశ్చిమాలు : కీడు.

మూడు ద్వారాలు : 

తూర్పు, పడమర, దక్షిణ : సౌఖ్యలోపం. 

తూర్పు, ఉత్తర, దక్షిణాలు : సంపద.

తూర్పు, ఉత్తర, పశ్చిమాలు : అనారోగ్యం.

 ఉత్తర, దక్షిణ, పశ్చిమాలు : కీర్తిసంపదలు.

నాలుగు దిశల ద్వారాలు  : సౌఖ్యం, లాభ దాయకం. నాలుగు దిశలా ద్వారాలు ఉండడం అన్ని విధాలా శ్రేయస్కరం. 


ఇంటి నిర్మాణంలో ద్వారాలు సంఖ్య సరిసంఖ్యలో ఉండాలి. 1,2 ,4, 6, 8, 12, 16 సరి సంఖ్యలో ఉండేలా చూసుకోవాలి. 10, 20, 30 సున్న అంకెలతో ఉండే ద్వారాలు పనికిరావు. ఇంటి మొత్తానికి ఒకటే ద్వారం ఉంటే మంచిదే.. కానీ 3, 5, 7, 9  ఇలా బేసి సంఖ్యలో ద్వారాలు ఉండకూడదు. ఇలాగే ఇంటిలోని కిటికీలు, అలుమార, దూలాలు, వెంటిలేటర్లు సరి సంఖ్యలో మాత్రమే ఉండాలి. సింహద్వారానికి రెండు పక్కల కిటికీలు ఉండేలా చూసుకోవాలి. దక్షిణ, పశ్చిమ దిశలలో కిటికీలు విధిగా ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్