||ప్రతీకాత్మక చిత్రం||
మనిషికి జీవించడానికి ఇల్లు ఎంత ముఖ్యమో వాటిని నిర్మించుకునేందుకు వాస్తు అంతే ముఖ్యం. వాస్తు ప్రకారంగా ఇల్లు కట్టినప్పటికీ ఇంట్లో పెట్టుకునే వస్తువులు ఏ దిక్కున పెట్టుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి. ప్రతి మనిషికి అవసరమైనది డబ్బు. డబ్బు లేనిదే ఏం సాధించలేము అనే లోకంలో మనం ఉన్నాం. అయితే ప్రతి ఒక్కరికి అవసరమైన డబ్బును దాచుకునే బీరువా ఎటువైపు పెట్టుకోవాలి. ఎటువైపు పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఇప్పుడు తెలుసుకుందాం..
వాస్తు ప్రకారం ఇంటిలో గదులు ఎటువైపు నిర్మించుకోవాలి. నిర్దేశించిన వస్తువులను ఎటువైపు పెట్టాలో పూర్వికులు నిర్ణయించారు. అయితే కొన్ని ప్రదేశాల్లో బరువు పెట్టడం వలన మంచి ఫలితాలు ఉంటాయంటారు. కొన్ని ప్రదేశాల్లో బరువు పెట్టకూడదు అని శాస్త్రాలు చెప్పబడుతున్నాయి. నైరుతి భాగం ఇంటికి ప్రధాన మూలగా చెప్పబడుతుంది అయితే భాగంలో బరువును ఉంచితే మంచిదని చాలామంది అనుకుంటారు. వాస్తవానికి ఆ దిక్కులో బరువు అనేది పెట్టకూడదు. అయితే డబ్బును దాచుకునే బీరువాను ఎక్కువ మంది నైరుతి భాగంలో పెడతారు కానీ అలా పెట్టకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. పడమర మరియు ఉత్తర మధ్యలో ఉన్న వాయువ్య దిశలో బీరువాను పెట్టడం ఉత్తమం అని వాస్తు శాస్త్రం చెబుతుంది. ప్రవాహానికి అధిపతి అయిన చంద్రుడు వాయువ్య దిశలో ఉంటాడు అలాగే ఉత్తర దిశలో కుబేరుని స్థానం. కాబట్టి వాయువ్య దిశలో బీరువాను పెట్టి, బీరువా తెరిచినప్పుడు మన ముఖం ఉత్తరం దిక్కు ఉండేలా బీరువా అమర్చాలి. ఇలా చేయడం వల్ల ధన నష్టం జరగకుండా ధనం ప్రవాహంలా వస్తుంటుంది. ఇలా కాక నైరుతి భాగంలో బీరువా ను ఉంచడం వల్ల ఎంత డబ్బు సంపాదించిన అది మన చేతిలో నిల్వకుండా ఉంటుంది. అలాగే డబ్బు వచ్చినట్లే వస్తుంది కానీ మళ్ళీ వృధాగా ఖర్చు అయిపోతుంది.
-1.jpg)