|| ప్రతీకాత్మక చిత్రం ||
వాస్తు శాస్త్రం.. ఇది పురాతన కాలం నుండి అందరి నమ్మకాలను అనుసరిస్తూ.. ఇంట్లో ఏ దిక్కున ఏముండాలి. ఏ దిక్కులో ఏం పెడితే ఇంట్లో అందరికీ బాగుంటుంది, అష్టైశ్వర్యాలతో ఉంటారు. కొత్త ఇల్లు నిర్మించడానికి వాస్తు శాస్త్రం తెలుసుకొని ఇంటిని ప్రారంభిస్తారు అంటే ఇంట్లో అందరికీ అన్ని విషయాలలో బాగుండాలని వారి నమ్మకాలతో వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని నిర్మించుకుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఏఏ దిక్కుల్లో ఎలాంటి వస్తువులను ఉంచితే మంచిదో తెలుసుకుందాం..
సాధారణంగా మనకు తెలిసినవి దిక్కులు నాలుగు, మూలలు నాలుగు. అవి ఉత్తరం (N), దక్షిణం (S), తూర్పు (E), పడమర (W). వీటితోపాటు నాలుగు మూలలు ఈశాన్యం (NE), వాయువ్యం (NW), ఆగ్నేయం (SE), నైరుతి (SW) ఉన్నాయి. ఇలా దిక్కులు, మూలాలను అనుసరిస్తూ కొత్త ఇంటిని, వారి వ్యాపారం కోసం నిర్మించుకున్న భవనాలు, కార్యాలయాలను ఈ వాస్తు శాస్త్రం ప్రకారం నిర్మించుకుంటారు. ఎలాంటి నష్టాలు కలగకుండా, ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు వాస్తు శాస్త్రం తెలుసుకొని ప్రారంభిస్తారు.
తూర్పు(East) : ప్రతిరోజు కాంతివంతంగా మన జీవితాన్ని వెలుగులో కనిపించేలా చేసే ఆ సూర్యభగవానుని సూర్యకిరణాలు మన పైన పడేందుకు ఇంటిని, వ్యాపార,భవనాలను ఈ దిశలో నిర్మించడం మంచిది. ఈ దిశలో ఇంటి యొక్క తలుపులు, కిటికీలు, బాల్కనీ, తోటలు ఉండటం వలన ఇంటిలో ఆరోగ్యం, వైద్యం ఏర్పడుతుంది. ఈ దిశలో లివింగ్ రూమ్, డ్రాయింగ్ రూమ్, ఫ్యామిలీ లాంజ్ ఏర్పాటు చేయడం మంచిది.
పడమర (West) : ఈ దిశను శక్తినిచ్చే దిశగా చెప్పుకోవచ్చు. ఈ దిశలో పడకగది, ఆట పరికరాలను నిల్వ ఉంచే స్టోరేజ్ రూముగా ఇంకా ఈ దిశలో ఓవర్ హెడ్ ట్యాంకులను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ దిశలో డైనింగ్ టేబుల్ వేసుకొని భోజనం గదిగా ఉపయోగించుకోవచ్చు. ఇక కార్యాలయాలలో క్యాబిన్లకు ఏర్పాటుకు మంచి దిశ.
దక్షిణం ( South) : ఈ దిశలో మాస్టర్ బెడ్ రూమ్, ఆఫీసు, కార్యాలయాలు, వ్యాపార భవనాలు, ఎంటర్టైన్మెంట్ గదులుగా ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడం ఉత్తమం. ఈ దిశను కీర్తి రాజ్యాంగ పరిగణిస్తారు.
ఉత్తరం (North) : ఈ దిశను కుబేరుని స్థానంగా పిలవబడతారు. ఈ దిశలో ప్రవేశ ద్వారం,వాకిలి,గార్డెన్, బాల్కనీ, స్విమ్మింగ్ పూల్, పడకగది, కిటికీలు నిర్మించడం వలన ఇంట్లో సంపద, వృత్తికి అనుకూలమైన దిశ.
ఈశాన్యం (North East) : ఈ దిశలో మనశ్శాంతికి కేరాఫ్ అడ్రస్ అని చెప్పుకోవచ్చు. ఈ దిశలో పూజాగదిని, ప్రార్థన చేసుకునేందుకు వీలుండే గదిని, ధ్యానం, యోగా రూముగా ఏర్పాటు చేసుకోవడం మంచిది.
వాయువ్యం ( North West) : గాలికి ప్రధాన దిశగా చెప్పుకోవచ్చు. ఈ దిశలో వెంటిలేటర్లు, వంటగది, అతిథి గది, మరుగుదొడ్లు ఏర్పాటు చేసుకునేందుకు అనుకూలమైనది.
ఆగ్నేయం ( South East) : ఈ ప్రాంతం ఇంటి యజమాని ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తుంది. ఈ ప్రాంతాన్ని వంటగది, విద్యుత్ పరికరాలు నిల్వకు, సృజనాత్మక కార్యకలాపాలకు, ఆఫీస్ క్యాంటీన్ కు ఉపయోగించుకుంటే మంచిది.
నైరుతి (South West) : ఈ దిశలో ఇంటి యాజమానికి పడకగది కోసం, సీనియర్ అధికారులకు పడకగది కోసం ఈ దిశలో ఏర్పాటు చేసుకొని దక్షిణ దిశలో మరుగుదొడ్లను ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఈ దిశ ఇంటికి, విలువైన వస్తువులను దాచుకోవడానికి, కార్యాలయాలకు, భవనాలకు అనుకూలమైన దిశగా చెప్పుకోవచ్చు.
.jpg)