||ప్రతీకాత్మక చిత్రం||
ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడుతున్నాయా... అసలు ఎందుకిలా జరుగుతుందో అర్థం కావడం లేదా.. మన ఇంట్లో మన ఇష్టంతో పెట్టుకున్న బొమ్మలు, చిత్రపటాలు కూడా మనకు నెగిటివ్ ఎనర్జీని, ఆర్థిక సమస్యలను తెచ్చిపెడతాయట.. ఇంటిని అలంకరణతో నింపేయడం అంటే అందరికీ ఇష్టమే.. కానీ ఆ అలంకరణ కోసం వాడే బొమ్మలు, చిత్రపటాల వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి. అసలు ఎలాంటి బొమ్మలు, చిత్రపటాలు పెట్టుకుంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అసలు ఇంట్లో ఎలాంటి బొమ్మలు ఉంచుకుంటే మంచిది. ఎలాంటి బొమ్మలు ఉంచుకోకూడదు.
ఎలాంటి వస్తువులు ఇంట్లో ఉంచుకోవడం వల్ల నెగటివ్ ఎనర్జీ వస్తుంది :
ముఖ్యంగా మనకు ఇష్టమైన వాళ్ళు ఇచ్చిన బహుమతులను విరిగిన, పాడైపోయిన మనం అలాగే దాచుకుంటూ ఉంటాం. కానీ అలా పాడైపోయిన వస్తువులను ఇంట్లో ఉంచుకోవడం వల్ల నెగటివ్ ఎనర్జీ వస్తుంది.
ఇంట్లో నల్లల నుండి నీరు కారుతూ ఉంటే ఇంట్లో ధనం నిల్వ ఉండకుండా నీటి వలె కరిగిపోతూ ఉంటుంది. దీనివల్ల ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత నీటిని పొదుపు చేసి నల్లల నుండి నీరు కారకుండా చూసుకుంటే ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.
ఇకపోతే ఇంట్లో చిత్రపటాల వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ వస్తుందంటే.. అలాంటి చిత్రాలను ఇంట్లో ఉంచుకోకపోవడమే మంచిది. ఇంట్లో పిల్లల చిత్రపటాలు ఎల్లప్పుడు నవ్వుతూ ఆహ్లాదంగా కనిపించే వాటిని పెట్టుకుంటే మంచిది. కానీ ముద్దు ముద్దుగా ఉంది అని ఏడ్చే చిత్రపటాలను పెట్టుకోవడం వల్ల ఇంట్లో ఆడవాళ్లపై ఆ ప్రభావం పడుతుంది.
ఇంట్లో సముద్రాలు, పడవలు, ఓడల చిత్రపటాలు పెట్టుకుంటారు. వాటిలో కూడా కొన్ని రకాలుగా ఉంటాయి. మునిగిపోయి ఉన్న పడవ, అలజడి రేపుతున్న సముద్రాల చిత్రపటాలు ఉంచుకోవడం వల్ల కుటుంబ సభ్యులకు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.
ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పాడైపోయిన, పని చేయకపోయినా గడియారాన్ని ఉంచుకోకూడదు. ఇలా ఉంచుకోవడం వల్ల మన జీవితంలో ఎదుగుదల అనేది ఆగిపోతుంది.
పూజ గదిలో కానీ ఎక్కడైనా విరిగిపోయిన, ముఖచిత్రం సరిగ్గా లేని దేవుని విగ్రహాలు, చిత్రపటాలను ఇంటిలో ఉంచుకోకూడదు. దీనివల్ల ఇంటిలో నెగటివ్ ఎనర్జీ వస్తుంది. ఇలాంటి చిత్రపటాలను, విగ్రహాలను దగ్గర్లో ఉన్న ఆలయాల్లో కానీ పారే నీటిలో కానీ వేయడం మంచిది.
ఇంట్లో క్రూర మృగాలకు సంబంధించిన బొమ్మలు కానీ, చిత్రపటాలను కానీ ఉంచుకోకూడదు. ఇలా ఉంచుకోవడం వల్ల ఇంట్లో అశాంతి తలెత్తుతోంది. అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులకి గొడవలు మొదలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఎలాంటి వస్తువులు ఇంట్లో ఉంచుకోవడం వల్ల మంచి కలుగుతుంది:
అందమైన పువ్వులతో కూడిన చిత్రపటాలను, ఫ్లవర్ వాసులను ఇంట్లో ఉంచుకోవడం మంచిది. మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చే వాటిని మనం సెలెక్ట్ చేసుకుని ఇంట్లో పెట్టుకోవాలి.
మంచి గ్రీనరీ తో కూడిన చిత్రపటాలను, గార్డెన్ ఏర్పాటు చేసుకోవడం మంచిది. మంచి గార్డెన్ ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇంట్లో కూడా ఆక్సిజన్ అందిస్తూ ఉంటాయి.
బుద్ధుని చిత్రపటాలు, విగ్రహాలు ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఇంట్లో అంత ప్రశాంతంగా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది.
మనీ ప్లాంట్ వంటి మొక్కలను ఇంట్లో పెంచుకోవడం వల్ల నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
ఇంట్లో తూర్పు దిశలో టీవీ డివిడి ప్లేయర్లు చిత్రపటాలు, బొమ్మలు పెట్టుకుంటే ఇంట్లో అనుకూల పరిస్థితులను ఉంటాయి.
ఇంట్లో స్టవ్, రోలు ఒకే దగ్గర ఉండేలాగా చూసుకోవాలి. లేదంటే వీటి మధ్య నడిచే అంత దారి ఉంటే ఆ ఇంట్లో గొడవలు ఏర్పడతాయి.