Vasthu Tips | ఇంట్లో తాబేలు ఉంటే మంచిదా.. దాని పర్యవసానాలు ఏంటంటే..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||ప్రతీకాత్మక చిత్రం||


తాబేలు ఇంట్లో ఉండటం వల్ల వాస్తు దోషాలు పోయి, ఆర్థిక సమస్యలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. తాబేలు సరైన స్థానంలో ఉంటే ఇంట్లో అదృష్టం కలిసి వస్తుంది. ఎలాంటి తాబేలు బొమ్మ ఇంట్లో ఉంచుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుందో.. అలాగే ఏ దిక్కున తాబేలు బొమ్మలు ఉంచితే ఆర్థిక సమస్యలు ఏర్పడకుండా ఉంటాయో.. 

మెటల్ తాబేలు : 

ఇంట్లో ఉండడం వల్ల ఆయుష్షు పెరుగుతుంది అలాగే పిల్లల మనసు ప్రశాంతంగా ఉండేందుకు దోహదపడుతుంది దీనిని పిల్లల గదిలో ఉంచడం వల్ల పిల్లల విజ్ఞానం పెరుగుతుంది. 

చెక్క తాబేలు : 

చెక్క తాబేలు ఇంట్లో ఉండటం వల్ల ఇంట్లో అంతా సంతోషంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. చెక్క తాబేలును ప్రవేశ గదిలో లేదా ప్రవేశద్వారం దగ్గర ఉంచడం ద్వారా మంచి జరుగుతుంది. 

నాణేలు తాబేలు :  

నాణేలు తాబేలును ఇంట్లో ఉంచుకోవడం వల్ల డబ్బును ఆకర్షించడానికి ఇంకా ఇంట్లో కుటుంబ సభ్యుల ఆరోగ్యం వారి జీవితాలపై మంచి ప్రభావం చూపిస్తుంది. నాణేలు తాబేలు బొమ్మను ఉపయోగించడం వల్ల ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. ఇది పురాతన వాస్తు ప్రకారం గొప్ప తాబేలుగా చెప్పుకోబడుతుంది. 

క్రిస్టల్ తాబేలు :  

క్రిస్టల్ తాబేలు ఇంట్లో డబ్బు రావడానికి నైరుతి దిశలో, కీర్తి పెరగడానికి వాయువ్య దిశలో ఉంచడం మంచిది. ఈ తాబేలును ఇంట్లో ఉంచుకోవడం వలన మీ ఎదుగుదలకు మంచిగా ఉపయోగపడుతుంది. 

వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో తాబేలును బుధవారం, గురువారం, శుక్రవారంలలో ఇంట్లో తాబేలును ఉంచడం ఉత్తమం.



సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్