అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలవటంతో ఇండియాలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. బుధవారం తులం బంగారం (10 గ్రాములు) ధర రూ.79,930 ఉండగా.. గురువారం ధర రూ.76,920కి తగ్గింది.
ఈవార్తలు, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలవటంతో ఇండియాలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. బుధవారం తులం బంగారం (10 గ్రాములు) ధర రూ.79,930 ఉండగా.. గురువారం ధర రూ.76,920కి తగ్గింది. అయితే, శుక్రవారం నాటికి మళ్లీ రూ.78,560కి పెరిగింది. మరోవైపు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. కిలో వెండి ధరపై రూ.3 వేల వరకు తగ్గింది. దీంతో మదుపరులు, వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు కొనుగోలు చేయడానికి ముందుకొస్తున్నారు. మరోవైపు, భారత్‌తో పాటు అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. అక్టోబర్‌లో దేశీయంగా రికార్డు స్థాయికి పెరిగిన బంగారం ధరలు.. గురువారం మధ్యాహ్నం 1.10 గంటల నాటికి రూ.66,920గా ఉంది. బుధవారంతో పోల్చి చూస్తే రూ.2,100 తగ్గింది. కిలో వెండి ధర రూ.91,140 ఉంది.
మరోవైపు, పెళ్లిళ్ల సీజన్ సమయంలోనే బంగారం ధరలు తగ్గడంతో పెళ్లివారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కార్తీక మాసంలో పెళ్లిళ్లు అధికంగా ఉంటాయి. దాంతో బంగారానికి డిమాండ్ ఉంటుంది. సరిగ్గా ఇదే సమయంలో బంగారం ధరలు తగ్గడంతో పెళ్లి పరివారం అంతా బంగారం దుకాణాలవైపు దారిపడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2708.80 డాలర్లుగా ఉంది. స్పాట్ సిల్వర్ 32 డాలర్ల స్థాయికి చేరింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.84.350 వద్ద కొనసాగుతోంది.