US Visa | భారతీయ ఉద్యోగులకు అమెరికా గుడ్ న్యూస్.. జో బైడెన్ కీలక నిర్ణయం

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||ప్రతీకాత్మక చిత్రం Photo: Twitter||

న్యూయార్క్: భారతీయ ఉద్యోగులకు అమెరికా సర్కారు శుభవార్త చెప్పింది. టెకీలకు ఉపయోగపడేలా కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు ప్రకటించింది. హెచ్1బీ వీసా, ఎల్1 వీసాల పునరుద్ధరణకు సంబంధించి డొమెస్టిక్ వీసా రీవ్యాలిడేషన్ విధానాన్ని పునరుద్ధరించనుంది. ఈ ఏడాది చివరి నాటికి ప్రయోగాత్మకంగా దీన్ని ప్రారంభించనుంది. దీనివల్ల వేలాది మంది వీసాదారులకు ప్రయోజనం కలగనుంది. గతంలో హెచ్1బీ వీసా పునరుద్ధరణకు, స్టాంపింగ్ కోసం అమెరికాలో చేయించుకొనే వీలుండేది. 2004లో ఈ విధానంలో మార్పు చేశారు. దానివల్ల.. వీసా రెన్యూవల్ కోసం సొంత దేశానికి వెళ్లి రావాల్సి వస్తోంది. కొన్నిసార్లు స్టాంపింగ్‌కు నెలల సమయం పడుతోంది. ప్రస్తుతం అమెరికాలో రీస్టాంపింగ్‌కు అనుమతి లేదు. ఈ పరిస్థితుల దృష్ట్యా వీసా హోల్డర్లకు ప్రయోజనం చేకూర్చేలా జో బైడెన్ సర్కారు నిర్ణయం తీసుకోబోతోంది.

డొమెస్టిక్ వీసా రీవ్యాలిడేషన్ విధానాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించినట్లు అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. ఈ సంవత్సరం చివరి వరకు ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ విధానం అమల్లోకి వస్తే వేలాది మంది ప్రవాసులకు ప్రయోజనం కలుగుతుందని వివరించారు. అటు.. వీసా దరఖాస్తులను వెంటవెంటనే పరిష్కరించేలా ప్రయత్నిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇతర దేశాల్లోని రాయబార కార్యాలయాల్లోనూ వీసా పరిశీలన చేపడితే సమస్యలు ఉండవని అమెరికా అధ్యక్షుడికి సలహా కమిటీ సిఫారసు చేసింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్