|| బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మల సీతారామన్ ||
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో 5 వ సారి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. 75 సంవత్సారాల స్వాతంత్రపు బడ్జెట్లో అన్ని వర్గాల అభివృద్ధి కోసం ఇది అమృత కాలమని ఆర్థిక మంత్రి తెలిపారు. ప్రపంచంలోనే భారత్ అత్యధికంగా 7 శాతం వృద్ధిరేటు ఉన్న ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందని ఆర్థికమంత్రి తెలిపారు.
7 ప్రాధాన్య అంశాలుగా ఈ బడ్జెట్ రూపకల్పన,
సామాజిక భద్రత, డిజిటల్ పేమెంట్లలో చక్కటి వృద్ధి,
2047 లక్ష్యంగా పథకాలు ఏర్పాటు,
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల అభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్,
రూ.7 లక్షల వరకు పన్ను రహిత ఆదాయం,
అన్ని డిజిటల్ వ్యవస్థల్లో పాన్ కార్డును ఉమ్మడి గుర్తింపు,
ఐటీ అభివృద్ధి కోసం 30 అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు,
63 వేల సొసైటీల కంప్యూటరీకరణకు రూ.2,516 కోట్లు,
5జీ ప్రోత్సాహకానికి యాప్‌ల అభివృద్ధి కోసం వంద ల్యాబ్‌లు,
ఎంఎస్‌ఎంఈలకు వడ్డీ రేట్లలో ఒక శాతం తగ్గింపుతో రూ.2 లక్షల కోట్ల నిధులు,
రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు రూ.75 వేల కోట్లు,
పలు వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ 23 శాతం నుంచి 13 శాతానికి తగ్గింపు,
రూ.3 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను లేదు,
రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు 5 శాతం,
రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు 10 శాతం,
రూ.9 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు 15 శాతం,
రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 20 శాతం పన్ను,
సిగరెట్లపై కస్టమ్స్ డ్యూటీ పెంపు,
ఎంఎస్‌ఎంఈలకు ముందస్తు పన్ను రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్లకు పెంపు
ఎలక్ట్రిక్ వాహనాలపై కస్టమ్స్ డ్యూటీ,
టీవీ ప్యానెళ్ల ధరలు తగ్గింపు,
ఏకలవ్య పాఠశాలలకు 38,800 మంది ఉపాధ్యాయుల నియామకం,
రైల్వేకు రూ.2.40 లక్షల కోట్లు,
గిరిజనుల కోసం పీఎం పీవీటీజీ మిషన్ ఏర్పాటు,
శ్రీఅన్న పథకం ద్వారా చిరుధాన్యాల రైతులకు ప్రోత్సాహం,
నేషనల్ హైడ్రోజన్ గ్రీన్ మిషన్‌కు రూ.19,700 కోట్ల కేటాయింపు,
విద్యుత్ రంగానికి రూ.35వేల కోట్ల కేటాయింపు,
రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాలు,
మూల ధన వ్యయం పెంచేందుకు రాష్ట్రాలకు చేయూత,
సీనియర్ సిటిజన్స్ డిపాజిట్ పథకం రూ.15 నుంచి రూ.30 లక్షలకు పెంపు,
2025 వరకు అమల్లో మహిళా సమ్మాన్ బచత్ పత్ర పథకం,
చిన్నారులు, యువత కోసం జాతీయ స్థాయిలో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు,
గోల్డ్,సిల్వర్ విదేశాల నుండి దిగుమతి అయ్యే కస్టమ్ డ్యూటీ పెంపు,