Group-2 Exam Telangana | గ్రూప్-2 పోస్ట్‌ పోన్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నిరుద్యోగుల వినతి

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||టీఎస్‌పీఎస్సీ Photo: Representative Image||

ఈవార్తలు, తెలంగాణ న్యూస్: వరుసగా పోటీ పరీక్షలు ఉన్న నేపథ్యంలో గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. గురుకుల, జూనియర్ లెక్చరర్ పరీక్షలు ముగిసిన తర్వాత నిర్వహించాలని, రెండు నెలల పాటు గ్రూప్-2ను వాయిదా వేయాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. ఈ మేరకు నిరుద్యోగులంతా కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి లేఖ రాశారు. ఆ లేఖలో ‘గురుకుల, జూనియర్ లెక్చరర్ పరీక్షలు ఉన్న వెంటనే గ్రూప్-2 పరీక్ష ఉండటం వల్ల ప్రిపేర్ కావటానికి ఇబ్బంది అవుతోంది. చదువుకోవటానికి కనీస వ్యవధి లేకుండా పోతోంది. అందువల్ల గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలి‘’ అని విజ్ఞప్తి చేశారు.

‘గ్రూప్-1కి రెండు సార్లు ప్రిపేర్ కావాల్సి రావటం, లీకేజీ వల్ల మానసిక ఒత్తిడికి గురవటం, వరుసగా పదిరోజుల వ్యవధిలోనే గ్రూప్-1, గ్రూప్-4 పరీక్షలు రాయటం, మళ్లీ ఈ నెలలో గురుకుల పరీక్షలు, ఆ తర్వాత సెప్టెంబర్‌లో జూనియర్ లెక్చరర్ పరీక్షలు ఉండటం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి.  ఈ మధ్యలోనే.. అంటే ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష ఉండటం కష్టం అవుతోంది. పైగా, ఎకానమీ పేపర్‌లో అదనంగా 70 శాతం సిలబస్‌ను కలపడం, దానికి తగ్గ పుస్తకాలు మార్కెట్‌లో అందుబాటులోకి రాకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి’ అని పేర్కొన్నారు. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని, అభ్యర్థులకు నష్టం కలుగకుండా గ్రూప్-2ను వాయిదా వేయాలని విన్నవిస్తున్నారు. చాలా మంది అభ్యర్థులు cs@telangana.gov.in కు మెయిల్ ద్వారా సీఎస్‌కు వినతులు చేస్తున్నట్లు సమాచారం.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్