||ప్రతీకాత్మక చిత్రం||
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2 ఉద్యోగాల కోసం వివిధ ప్రభుత్వ విభాగాల్లోని 783 పోస్టుల భర్తీ కోసం గత సంవత్సరం 29 డిసెంబర్ నోటిఫికేషన్ నెంబర్ 28/2022 ను విడుదల చేసింది తెలిసిందే. అయితే ఈ పరీక్షకు సంబంధించిన తేదీల వివరాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆగస్టు 29, 30 తేదీలలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. అభ్యర్థుల తమ హాల్ టికెట్ www.tspsc.gov.in అధికారిక వెబ్ సైట్ ఒక వారం ముందు నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. గ్రూప్ 2 ఉద్యోగాల కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,51,943 మంది దరఖాస్తు చేసుకున్నారని టీఎస్‌పీఎస్సీ పేర్కొంది. అంటే ఒక్క పోస్టుకి 705 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇక టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్, గ్రూప్-4 పరీక్ష తేదీలను కూడా ఖరారు చేసింది. జూన్ 5 తేదీ నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించగా, జులై 1వ తేదీ నుంచి గ్రూప్-4 పరీక్షలు నిర్వహించనున్నారు.