Vastu Tips | ఇంట్లో దేవుడి గది ఏ దిక్కున ఉండాలి.. పూజలో చేయకూడదని తప్పులేంటంటే..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||ప్రతీకాత్మక చిత్రం||


హిందూ మత ప్రకారం దేవుళ్లను పూజించడం ఒక సాంప్రదాయంగా వస్తోంది. దేవుళ్లను పూజించడం వల్ల జీవితంలో సుఖ, సంతోషాలు కలుగుతాయని, కష్టాల్లో ఉన్నవారు దేవుడిని పూజించడం వలన కష్టాలనుండి బయటపడతారు. అయితే దేవుళ్లను పూజించేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి. నియమాలు పాటించకుండా పూజ పూర్తి చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి. పూజలో ఎలాంటి తప్పులు చేయకూడదు ఇప్పుడు తెలుసుకుందాం.. 

ముఖ్యంగా పూజలో దీపం వెలిగించే కుందులను, నీటి పాత్రలను పక్కపక్కన పెట్టకూడదు. అవి రాగివైయినా, ఇత్తడివైనా, మట్టి పాత్రలైనా..  అయితే పూజకు ఉపయోగించే కలశాన్ని, నీటి పాత్రలను ఎప్పుడు ఈశాన్య దిశలో ఏర్పాటు చేయాలి. అలాగే దీపాన్ని ఆగ్నేయ దిశలో ఏర్పాటు చేయాలి. 

పూజలో ఎల్లప్పుడు వికసించే, సువాసన విరజల్లే పువ్వులను మాత్రమే సమర్పించాలి. వాలిపోయిన, కుళ్లిపోయిన పువ్వులను దేవుడికి సమర్పించకూడదు. అలాగే పూజకు నిషిద్ధంగా ఉన్న పువ్వులను పూజలో ఉపయోగించకూడదు. 

హిందూ మత సాంప్రదాయంలో ఏ దేవతకు పూజ చేసిన ఆసనం తప్పనిసరిగా వేయాలి. ఏ దేవతకు పూజ చేసిన నవగ్రహాలకు సంబంధించిన పూజలు చేసిన ఆసనం ఉపయోగించాలి. ఆసనం లేకుండా చేసే పూజ దైవకార్యాలు ఎటువంటి ఫలితాలు ఇవ్వలేవు బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది. నేలపైన కూర్చొని పూజ చేసిన వారికి ఫలాలు దక్కవని విశ్వాసం. అలాగే పూజ చేసిన తర్వాత ఆసనాలను తీసి పక్కన పెట్టాలి.

దేవునికి పూజ చేసే సమయంలో గర్వాన్ని ప్రదర్శించకూడదు. గర్వంతో పూజ చేసినట్లయితే వారికి పూజ చేసిన ఫలితం దక్కకపోగా గర్వానికి తగు ఫలితాన్ని దేవుడు ప్రసాదిస్తాడు. భగవంతుని ఆరాధన సమయంలో ఎల్లప్పుడూ మనస్ఫూర్తిగా, ఏకాగ్రతతో, నిర్మాణమైన మనసుతో పూజ చేయాలి. 

దేవుని పూజించే సమయంలో ఎల్లప్పుడు ప్రశాంతంగా, స్వచ్ఛమైన మనసుతో పూజను ప్రారంభించి పూజ ముగిసే వరకు దేవుని నామస్మరణతో ప్రార్థిస్తూ ఉండాలి. మనిషి పూజ దగ్గర ఉండి మనసు ఎక్కడో ఉంటే ఆ పూజకి ఎటువంటి ఫలితం ఉండదు. పూజ చేసే సమయంలో ఎవరిని కోపడకూడదు. ఇతరుల విషయంపై జోక్యం చేసుకోకూడదు. ఇతరుల ఆలోచనలు కూడా చేయకూడదు. పూజ చేసే సమయంలో ధ్యాస మొత్తం దేవుడు పైనే పెట్టి దేవుడి నామస్మరణ చేస్తూ పూజ చేస్తేనే మంచి ఫలితాలు ఉంటాయి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్