రెండు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెళ్లి బాజాలు ఉన్నాయి. గడిచిన కొద్ది రోజుల నుంచి ముహూర్తాలు లేకపోవడంతో వివాహాలు నిలిచిపోయాయి. మూఢం, శూన్య మాసం కారణంగా వివాహాలు జరగడం లేదు. అయితే జూన్, జూలై నెలలో పెళ్లి ముహూర్తాలు ఉండడంతో భారీగా వివాహాలు జరగనున్నాయి.
వధూవరులు జంట
రెండు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెళ్లి బాజాలు ఉన్నాయి. గడిచిన కొద్ది రోజుల నుంచి ముహూర్తాలు లేకపోవడంతో వివాహాలు నిలిచిపోయాయి. మూఢం, శూన్య మాసం కారణంగా వివాహాలు జరగడం లేదు. అయితే జూన్, జూలై నెలలో పెళ్లి ముహూర్తాలు ఉండడంతో భారీగా వివాహాలు జరగనున్నాయి. ఈ నెల 29, జూలై 11, 12, 13, 14, 15 తేదీల్లో మంచి రోజులు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఆ తరువాత చతుర్మాసం కారణంగా ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు శుభ ముహూర్తాలు లేవు. మళ్లీ నవంబర్, డిసెంబర్లో ముహూర్తాలు ఉంటాయని పురోహితులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ముహూర్తాలు అనుగుణంగా పెళ్లిళ్లు పెట్టుకున్న వాళ్ళు భారీగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.