దేశంలో జికా వైరస్ ప్రజలను భయపెడుతోంది. తాజాగా మహరాష్ట్రలోని పూణెలో ఐదుగురికి జికా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. జికా వైరస్‌లో పెద్దగా లక్షణాలు కనిపించే అవకాశం ఉండదు. డెంగ్యూ తరహా లక్షణాలు మాత్రమే ఉంటాయని, అటువంటి సమయంలో అప్రమత్తత అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు.
zika virus
దేశంలో జికా వైరస్ ప్రజలను భయపెడుతోంది. తాజాగా మహరాష్ట్రలోని పూణెలో ఐదుగురికి జికా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. జికా వైరస్‌లో పెద్దగా లక్షణాలు కనిపించే అవకాశం ఉండదు. డెంగ్యూ తరహా లక్షణాలు మాత్రమే ఉంటాయని, అటువంటి సమయంలో అప్రమత్తత అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు. డెంగ్యూ జ్వరాన్ని పోలి ఉంటుంది కాబట్టి అప్రమత్తత అవసరమని నిపుణులు చెబుతున్నారు. జికా వైరస్ డెంగ్యూ, చికున్ గున్యా, ఎల్లో ఫీవర్‌లను వ్యాపింపజేసే ఈజిప్ట్ ఎడిస్ దోమలు ద్వారా సంక్రమించే వ్యాధి. ఇది సాధారణంగా పగటి పూట కుడుతుంది. జికా వైరస్ బారినపడిన వారిలో జ్వరం, దద్దుర్లు, తలనొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు, కనురెప్ప దిగువ భాగంలో వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. రెండు నుంచి వారం రోజులపాటు ఈ లక్షణాలు కనిపిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం నమోదవుతున్న కేసల్లో 80 శాతం కేసుల్లో లక్షణాలు కనిపించడం లేదని నిపుణులు చెబుతుండడం గమనార్హం. . జికా వైరస్ బారినపడిన వారిలో జ్వరం, ఎరుపు కళ్లు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, మాక్యులోపాపులర్ దద్దుర్లు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పులు, కాలువలు మూసుకుపోవడం వంటి కారణాలు వల్ల జికా వైరస్ సోకుతుంది. వ్యక్తిగత స్థాయిలో పరిశుభ్రతను పాటించడంతోపాటు పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవడం జికా వైరస్ నుంచి రక్షణ పొందవచ్చు.
జికా వైరస్ ఇన్‌ఫెక్షన్ గర్భిణీ నుంచి ప్రసవించిన తరువాత బిడ్డకు సోకే అవకాశముంది. లైంగిక సంపర్కం ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి, తగిన నియంత్రణ పద్ధతులు పాటించాలి. రక్త మార్పిడి, అవయవ మార్పిడిలో కూడా వ్యాప్తికి అవకాశం ఉంది. జికా వైరస్ బారినపడిన వారికి కొన్ని పరీక్షలు చేయడం ద్వారా నిర్ధారించవచ్చు. రక్తం, మూత్రం పరీక్షలు నిర్వహించడం ద్వారా వ్యాధిని గుర్తిస్తారు. రక్తంలో జికా వైరస్ యాంటీబాడీలను తనిఖీ చేయడానికి పరీక్షలు నిర్వహిస్తారు.
ఇదీ చికిత్స
జికా వైరస్ బారినపడిన వారికి నిర్ధాష్ట చికిత్స అంటూ ఏదీ లేదు. వైరస్ బారినపడిన వ్యక్తి తగిన విశ్రాంతి తీసుకోవడం, ద్రవాలు ఎక్కువగా తీసుకోవడం, జ్వరం, ఇతర లక్షణాలు నొప్పికి అసవరమైన మందులు వినియోగించాల్సి ఉంటుంది. దోమల ద్వారా జికా వైరస్ వ్యాప్తి చెందుతుంది కాబట్టి.. దోమ కాటు బారినపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పొడవైన చేతులు చొక్కాలు, పొడవాటి ఫ్యాంటు ధరించాలి. ఎయిర్ కండిషనింగ్ ఉన్న ప్రదేశాల్లో ఉండాలి. దోమలు రాకుండా కిటికీ, తలుపులకు స్ర్కీన్లు ఏర్పాటు చేయాలి.