ఏపీలో నూతన మద్యం పాలసీ.. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అమలు

రాష్ట్రంలో ఏర్పాటైన కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ విధానాల నుంచి మెల్లగా బయటకు వచ్చే ప్రయత్నం చేస్తోంది. గత ప్రభుత్వం అమలు చేసిన అనేక విధానాలను నూతన ప్రభుత్వం విడిచిపెడుతోంది. తాజాగా రాష్ట్రంలో అమలు చేస్తున్న మద్యం పాలసీని మార్చాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రభుత్వ మద్యం షాపులకు గుడ్ బై చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయించారు.

liquor

మద్యం 

రాష్ట్రంలో ఏర్పాటైన కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ విధానాల నుంచి మెల్లగా బయటకు వచ్చే ప్రయత్నం చేస్తోంది. గత ప్రభుత్వం అమలు చేసిన అనేక విధానాలను నూతన ప్రభుత్వం విడిచిపెడుతోంది. తాజాగా రాష్ట్రంలో అమలు చేస్తున్న మద్యం పాలసీని మార్చాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రభుత్వ మద్యం షాపులకు గుడ్ బై చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయించారు. సెప్టెంబర్ తర్వాత రాష్ట్రంలో ఎక్కడ ప్రభుత్వ మద్యం దుకాణాలు కనిపించకుండా ఉండేలా నూతన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పూర్తిగా ప్రైవేటు షాపులే ఉండేలా ఎక్సైజ్ శాఖ కొత్త పాలసీని రూపొందిస్తోంది. ఆరు రాష్ట్రాల్లోని మద్యం పాలసీలపై ఆ శాఖ అధికారులు అధ్యయనం చేసి ఇటీవల ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. వీటిలో తెలంగాణ తరహా పాలసీని ఉత్తమంగా ఉందనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. తాజాగా ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ ముందు ఈ నివేదికలు ఉంచి పాలసీకి తుది రూపు తీసుకురానన్నారు. అయితే దాదాపుగా తెలంగాణ పాలసీకే ప్రభుత్వ వర్గాలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. 

రాష్ట్రంలో 2017లో చివరిసారిగా ప్రైవేట్ మద్యం షాపులకు పాలసీ విడుదలైంది. 2019లో ఆది ముగిసిన తర్వాత అదే సంవత్సరం అక్టోబర్ 1 నుంచి వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ మద్యం షాపుల పాలసీని అమల్లోకి తెచ్చింది. అప్పటివరకు 4380 షాపులు ఉండగా, వైసీపీ ప్రభుత్వం వాటిని 3,500 కుదించింది. ఆ తర్వాత మరోసారి షాపుల సంఖ్యను 2,934కు తగ్గించారు. ఇవి కాకుండా టూరిజం కేంద్రాల్లో షాపుల పేరుతో మొత్తం 3,392 కు పెంచారు. ఇప్పుడు దాదాపుగా అదే సంఖ్యలో షాపులు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. 2023లో తెలంగాణ లిక్కర్ పాలసీ ప్రకటించినప్పుడు దరఖాస్తు ఫీజు కింద రూ.2,628 కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పుడు రాష్ట్రంలో కూడా ఈ రూపంలో కనీసం రెండు వేల కోట్ల వరకు వస్తుందని అంచనా వేస్తున్నారు. కొత్త పాలసీలో దరఖాస్తు ఫీజు 2 లక్షలు (నాన్ రెఫండబుల్) గా నిర్ణయించారు. ఒక్కో షాపునకు సగటు 40 దరఖాస్తుల ప్రకారం చూసిన రూ.2,300 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. అయితే, మొత్తం దుకాణాల్లో 10 శాతం అంటే దాదాపు 300 వరకు గీత కార్మికులకు కేటాయించాలి. వాటికి ఎక్కువ దరఖాస్తులు వచ్చే అవకాశం ఉండదు. దీంతో రెండు వేల కోట్ల వరకు ఆదాయం వస్తుందని భావిస్తున్నారు.

కొత్త పాలసీని పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే తీసుకువస్తున్నారు. దరఖాస్తుల నుంచి లాటరీ వరకు మొత్తం ఆన్లైన్లోనే ప్రక్రియ చేపట్టనున్నారు. కొత్త మద్యం పాలసీని ప్రభుత్వం వారం పది రోజులు వ్యవధిలో ప్రకటించనుంది. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ప్రైవేట్ షాపులు పాలసీ అమల్లోకి రానుంది. దరఖాస్తులు స్వీకరణ, పరిశీలన, లాటరీ ప్రక్రియను 20 రోజుల్లో పూర్తి చేసేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు. మరోవైపు సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ఎక్సైజ్ లో బదిలీలు ప్రారంభం కావాలి. ఈలోగా ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణ జీవోలు విడుదల చేయాలి. ఒకేసారి అటు బదిలీలు ఇటు కొత్త పాలసీ అంటే ఇబ్బందులు వస్తాయని భావించిన అధికారులు ప్రస్తుతానికి సిబ్బందిని సర్దుబాటు చేసి పాలసీ ప్రక్రియను ముగించాలని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) ను రద్దు చేసే జీవోను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేయనుంది ఎక్సైజ్ శాఖను పునర్వ్యవస్థీకరించాలని షబ్ను రద్దు చేయాలని తాజాగా కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ఎక్సైజ్ శాఖ చర్యలు చేపట్టింది ఇప్పటికే శాఖ పునర్వ్యవస్థీకరణపై అధికారుల కమిటీ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం ఆమోదించింది. అందుకు అనుగుణంగా సెబ్ ను రద్దు చేసి పూర్తిగా పాత విధానంలోకి ఎక్సైజ్ శాఖను తీసుకురానున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్