SSC Telangana : తెలంగాణలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

QQ1

(Pic: పదో తరగతి పరీక్షల షెడ్యూల్)

ఈవార్తలు, తెలంగాణ న్యూస్: తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 3వ తేదీ నుంచి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పదో తరగతి పరీక్షలపై బుధవారం ఆమె ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ ఏడాది నుంచి ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో పరీక్ష మాత్రమే నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కరోనా దృష్ట్యా ఇంతకు ముందు సిలబస్‌ను తగ్గించి పరీక్షలు నిర్వహించగా, ఈ సారి మాత్రం 100 శాతం సిలబస్‌తో పరీక్షలు నిర్వహిస్తామని వివరించారు. పెద్ద ప్రశ్నలకు చాయిస్ ఉంటుందని, చిన్న ప్రశ్నలన్నీ రాయాల్సిందేనని, వాటికి చాయిస్ ఉండబోదని స్పష్టం చేశారు.

QQ1

ఆరు పరీక్షలే నిర్వహించనున్న నేపథ్యంలో విద్యార్థుల కోసం నమూనా ప్రశ్న పత్రాలను సిద్ధం చేయాలని, వాటిని విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని మంత్రి సబిత అధికారులను ఆదేశించారు. పదో తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా క్లాసులు నిర్వహించాలని సూచించారు. సెలవు రోజుల్లోనూ ప్రత్యేక తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఏయే సబ్జెక్టులో విద్యార్థి వెనుకబడి ఉన్నారో గుర్తించి, వారికి ప్రత్యేకంగా బోధించాలని తెలిపారు. వార్షిక పరీక్షలకు ముందు ఫిబ్రవరి, మార్చిలో ఫ్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించాలని వెల్లడించారు. అటు.. 9, 10 తరగతులకు ఆరు పేపర్లతోనే పరీక్ష నిర్వహించేలా బుధవారం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఒక్కో సబ్జెక్టు రాత పరీక్షకు 80 మార్కులు, ఫార్మాటివ్ అసెస్‌మెంట్‌కు 20 మార్కులు కేటాయిస్తున్నట్టు వెల్లడించింది. 


QQ1


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్