కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల కుట్రే.. ఉద్యోగార్థులూ తస్మాత్ జాగ్రత్త.. కుట్రలో భాగం కావొద్దు

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||ప్రతీకాత్మక చిత్రం||

ఈవార్తలు, తెలంగాణ: గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను రద్దు చేయాలి.. ఉద్యోగార్థులంతా చేస్తున్న డిమాండ్ ఇదే. ఎందుకు రద్దు చేయాలి అంటే.. పేపర్ లీక్ అయ్యిందని అంటున్నారు. కానీ, పేపర్ లీక్ అయ్యిందన్నదానికి ఆధారాలున్నాయా? అంటే ఇంకా నిర్ధారణ కాలేదు. కానీ, గ్రూప్-1 రద్దు చేయాల్సిందేనని ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? అంటే.. ఇక్కడే కొందరి కుట్ర దాగుందని అర్థం అవుతోంది. ఆ కుట్ర ఎవరిది? ఎందుకీ కుట్రలు? అవును.. మిగతా పేపర్లు లీక్ అయ్యాయి, దానికి ప్రభుత్వాన్ని నిందించాల్సిందే. కానీ, ప్రిలిమ్స్ రద్దు చేయాల్సిందేనన్న డిమాండ్ల వెనుక ఎవరి హస్తం ఉంది? అని లోతుగా పరిశీలిస్తే పలు సంచలన విషయాలు అవగతం అవుతాయి. కొందరి స్వలాభం ఇందులో బయటపడుతుంది. అది ఎవరి కుట్ర అంటే కోచింగ్ ఇన్‌స్టిట్యూట్లదే అని కొందరు ఉద్యోగార్థులు ఘంటాపథంగా చెప్తున్నారు.

ఎందుకు కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్ కుట్రలు చేస్తాయని ఈవార్తలు టీం ఓ ఉద్యోగార్థిని అడగ్గా.. ‘పేపర్ రద్దు అయితే మాలాంటి వాళ్లం మళ్లీ కోచింగ్‌కు వస్తాం. దాంతో కోచింగ్ ఇన్‌స్టిట్యూట్లకు రూ.కోట్లలో వ్యాపారం. లక్షలు లక్షలు దండుకోవచ్చు. ఇదే కదా పెద్ద స్కాం. అందుకే ఇప్పుడు చేసే నిరసనలు, ధర్నాలకు స్పాన్సరింగ్ కూడా చేస్తాయి. కానీ, మేం మాత్రం ఆ డబ్బంతా అప్పు చేసి తీసుకొస్తాం. పెళ్లైనవాళ్లు పెళ్లాం, పిల్లల్ని ఇంట్లో వదిలేసి హైదరాబాద్ దాకా వస్తారు. ఇక్కడ హాస్టల్‌లోనో, రూం రెంట్ తీసుకొనో ఉంటారు. ముఖ్యంగా ఆడవాళ్లైతే భర్తను, పిల్లలను, చేస్తున్న వేరే ఉద్యోగాన్ని వదిలేసి ఇక్కడిదాకా వచ్చారు. మళ్లీ ఇప్పుడు కొత్తగా పరీక్ష అంటే మళ్లీ అప్పు చేయాలి, మరో సంవత్సరం వరకు ఖాళీగా కూర్చోవాలి’ అని వివరించాడు. 

‘లీక్ అయితే పరీక్ష రద్దు చేయడంలో అర్థం ఉంది. కానీ, ఇప్పుడే డిమాండ్లు చేస్తూ రోడ్ల మీదికి వస్తే మిగతా పోటీ పరీక్షలకు చదివే టైం వృధా అవుతుంది. మా సమయం వృధా చేసుకోవటం కోసం, ఇన్‌స్టిట్యూట్లకు డబ్బులు కట్టడం కోసం మేం ధర్నాలు, నిరసనలు చేయాలా?’ అని సదరు ఉద్యోగార్థి ప్రశ్నిస్తున్నారు. తాము ధర్నాలు, నిరసనలు చేయగానే పరీక్షను రద్దు చేయరని, కానీ.. వేరే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే సమయం మాత్రం వృధా అవుతుందని వెల్లడిస్తున్నారు. కొందరు రాజకీయ నాయకులు కూడా గ్రూప్-1 పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారని, అందులో వారి రాజకీయ స్వలాభంతో పాటు, ఇన్‌స్టిట్యూట్ల హస్తం ఉండి ఉండొచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్