||ప్రతీకత్మక చిత్రం|| తెలంగాణ రాష్ర్టంలో నిరుద్యోగులకు శుభవార్త .. రాష్ర్టంలో పలు కోర్టుల్లో 1904 పోస్టుల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు కోసం ఈ నెల 11వ తేదీ నుంచి ఆన్‌లైన్ ద్వారా ప్రారంభమై ఈ నెల 31వ తేదీతో దరఖాస్తుల గడువు ముగియనుంది. ఈ పోస్టుల వివరాలను సోమవారం నోటిఫికేషన్లో జారీ చేసింది. ఈ పరీక్ష హాల్‌టికెట్లను వైబ్‌సైట్ ద్వారా ఫిబ్రవరి 15వ తేదీ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామినర్, జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ విభాగాల్లో ఖాళీల వివరాలు, రిజర్వేషన్లు, విద్యార్హతలు ఇతర పూర్తి వివరాలు అధికారిక వెబ్ సైట్ ద్వారా తెలియజేసింది. పరీక్ష కు సంబంధించిన తేదీని మార్చిలో ఆయా పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ పరీక్ష తేదీలను త్వరలో ప్రకటిస్తామని హైకోర్టు రిజిస్టార్ తెలియజేశారు.
మొత్తం ; 1,904 పోస్టులు
ఎగ్జామినర్ ; 66
జూనియర్ అసిస్టెంట్ ; 275
ఫీల్డ్ అసిస్టెంట్ ; 77
రికార్డ్ అసిస్టెంట్ ; 97,
ప్రాసెస్ సర్వర్ ; 163
ఆఫీస్ సబార్డినేట్ ; 1226
ప్రారంభ తేదీ ; జనవరి 11,
ముగింపు తేదీ ; జనవరి 31
హాల్ టికెట్ డౌన్ లోడ్ ; ఫిబ్రవరి 15,
పరీక్షా తేదీ ; ప్రకటించలేదు,
అధికారిక వెబ్‌సైట్ ; tshc.gov.in ను సెర్చ్ చెయ్యండి,
సహాయక చర్యలు ; tshc@telangana.gov.in ఈ-మెయిల్ ద్వారా తెలుసుకోవచ్చు,
సహాయక నెంబర్; 040- 23688394.