||ప్రతీకాత్మక చిత్రం||
ఈవార్తలు, తెలంగాణ న్యూస్: గృహలక్ష్మి పథకం కోసం అర్హుల నుంచి తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ నెల 10వ తేదీ నుంచి అప్లికేషన్లను తీసుకోనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దరఖాస్తులు స్వీకరించిన అనంతరం ఈ నెల 20వ తేదీ నుంచి ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తామని, ఈ నెల 25వ తేదీ నుంచి అర్హులకు ఇంటిని మంజూరు చేస్తామని వెల్లడించింది. మండల, మున్సిపాలిటీ స్థాయిలో వెరిఫికేషన్ ఉంటుందని వివరించింది. ఇందుకోసం అన్ని మండలాలు, మున్సిపాలిటీ కార్యాలయాల్లో గృహలక్ష్మి కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జిల్లా కలెక్టర్లు అర్హుల జాబితాను రూపొందిస్తారని స్పష్టం చేసింది. దరఖాస్తు చేసుకొనేవారు ఇప్పటి వరకు ఇంటిని కలిగి ఉండరాదని వెల్లడించింది.
కావాల్సిన డాక్యుమెంట్లు:
1. దరఖాస్తు ఫారం & స్వీయ ధ్రువీకరణ
2. పాస్ పోర్ట్ సైజ్ ఫొటో
3. ఆధార్ కార్డ్ జిరాక్స్
4. రేషన్ కార్డ్ జిరాక్స్
5. కులం సర్టిఫికెట్
6. బ్యాంక్ అకౌంట్ జిరాక్స్
7. పట్టా పాస్ బుక్ జిరాక్స్