Ration Cards Telangana | తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు.. క్లారిటీ

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||ప్రతీకాత్మక చిత్రం||

ఈవార్తలు, తెలంగాణ న్యూస్: కొత్త రేషన్ కార్డుల జారీపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. సామాజిక మాధ్యమాలు, ఇతర చోట్ల రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై వస్తున్న సమాచారం తప్పు అని ప్రకటించింది. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలైందని వస్తున్న అసత్య ప్రచారాలు నమ్మవద్దని స్పష్టం చేసింది. ‘కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయ్యింది. ఈ నెల 21వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. రేషన్ కార్డు లేనివారు, పాత రేషన్ కార్డులో తప్పుల సవరణకు దరఖాస్తు చేసుకోవచ్చు‘ అంటూ సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం నమ్మొద్దని తెలిపింది.  ‘అసత్య ప్రచారం నమ్మొద్దు.. ప్రజలను అయోమయానికి గురిచేసే ప్రకటనలను ప్రచారంలోకి తేవొద్దు’ అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు.



సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్