కొన్ని కొన్ని సార్లు మన రోమాలు ఎందుకు నిక్కబడుచుకుంటాయి? కొంతసేపు నీటిలో చేతులు కానీ, కాళ్లు కానీ పెడితే ముడతలు ఎందుకు వస్తాయి? మన చేతికి ఉన్న గోర్లకు ఎందుకు తెల్లని గీతలు ఏర్పడుతాయి? అప్పుడే పుట్టిన పిల్లలు ఏడ్చినప్పుడు ఎందుకు కళ్లలో నుండి నీరు రావు? అమ్మాయిల కళ్ల కన్నా అబ్బాయిల కళ్లు ఎందుకు తక్కువ రంగులను చూడగలగుతుంది? ఇలాంటి కొన్ని ఎవరికి తెలియని విషయాల గురించి తెలుసుకుందాం.
- కొందరికి చేతి గోర్లకు చివరలో తెల్లని గీత ఉంటుంది. అలా ఎందుకు ఉంటుంది అనే విషయం ఎవరికీ తెలీదు. దానికి కారణం శరీరంలో ఐరన్, క్యాల్షియం, మినరల్స్ తక్కువగా ఉన్నప్పుడు తెల్లని గీతలు ఏర్పడుతాయి.
- ఎవరైతే ఎడమ చేతిని వాడుతారో వారు మిగిత వారి కంటే తొమ్మది నెలల తక్కువ కాలం బతుకుతారు అని 1989 ది అమెరికన్ పబ్లిక్ జనరల్ స్టడీస్‌లో తెలిసింది.
- ఇంటర్నేషల్ హైపర్ హైడ్రోసిస్ సొసైటీ ప్రకారం మన శరీరంలో మొత్తం 5లక్షల చెమట గ్రంథులు ఉంటాయి. అందులో చాలా ఎక్కువ గ్రంథులు చేతులు, కాళ్లు, నుదిటి భాగంలోనే ఉంటాయి.
- మన శరీర బరువులో మెదడు కేవలం 2 శాతం మాత్రమే ఉంటుంది. మనిషి మెదడు 70 శాతం నీటితో తయారై ఉంటుంది.
- శాస్త్రవేత్తల పరిశోధనలో ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి తన 70 సంవత్సరాలలో 30 వేల కిలోల ఆహారాన్ని తీసుకుంటాడు.
- 20 లక్షల దోమలు మనిషిని కుడితే మనిషి చనిపోతాడు.
- వేలి ముద్రలు ఒక్కో మనిషికి ఒక్కోలా ఉంటాయి. ఎవరికీ ఒకేలా ఉండవు. ఉదాహరణకు ఇద్దరు కవలలు ఒకే తల్లి గర్భం నుండి పుట్టినా ఆ ఇద్దరి వేలి ముద్రలు ఒకేలా ఉండవు. అదేవిధంగా నాలుకపై మీద ఉన్న ముద్రలు కుడా అంతే.
- ఇద్దరు వ్యక్తులు పది నిమిషాల పాటు ముద్దు పెట్టుకుంటే ఆరోగ్యంగా ఉంటారు.
- పుట్టిన పిల్లలు ఏడ్చినప్పుడు వారి కళ్లలో నుండి కన్నీళ్లు రావు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే అప్పుడే పుట్టిన పిల్లలకి టీయర్ డక్స్ ఇంకా తయారు అవ్వకపోవడం వల్ల.
- నీటిలో చాలా సమయం చేతిని ఉంచితే ముడతలు ఏర్పడుతాయి. యుకే యూనివర్సిటీలో ఈ విషయం రిసెర్చ్ చేసి ఏం చెప్పారంటే మనం ఎక్కువ సేపు నీటిలో ఉన్నప్పుడు మన చేతులు, కాళ్లు బలహీనమై ఈ ముడుతలు వస్తాయి.
- కొన్ని కొన్ని సార్లు మన శరీరంపై రోమాలు నిక్కబొడుస్తాయి. శరీరంలో యాండ్రేనల్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఎప్పుడైతే ఆ ఈ హార్మన్ ఎక్కువగా రిలీజ్ అవుతుందో అప్పుడు రోమాలు నిక్కపొడుస్తాయి.
సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్