||ప్రతీకాత్మక చిత్రం Photo: Twitter||
ఈవార్తలు, తెలంగాణ : తెలంగాణలో పాఠశాల విద్యార్థులకు ఏప్రిల్ 25వ తేదీ నుంచి సమ్మర్ హాలీడేస్ ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. సమ్మేటివ్ అసెస్మెంట్2 పరీక్షలపైనా సమాచారం అందించింది. ఏప్రిల్ 10వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా, ఏప్రిల్ 12వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి. పరీక్షలు పూర్తయ్యాక ఏప్రిల్ 25వ తేదీ నుంచి జూన్ 11 వ తేదీ వరకు.. 48 రోజుల పాటు వేసవి సెలవులు కొనసాగనున్నాయి. జూన్ 12వ తేదీన పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. అటు.. ఎండలు దారుణంగా మండిపోతున్నందున మార్చి రెండో వారం నుంచి ఒంటి పూట తరగతులు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.