Fact Check : ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంపు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

Fack Check : కేంద్రంలో సర్వీస్ చేస్తున్న ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు కేంద్ర ప్రభుత్వం పెంచాలని ఆలోచిస్తోందని, త్వరలోనే పెంచుతుందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వ పత్రిక సమాచార కార్యాలయం (PIB) స్పందించింది.

government of india

ప్రతీకాత్మక చిత్రం 

Fack Check : కేంద్రంలో సర్వీస్ చేస్తున్న ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు కేంద్ర ప్రభుత్వం పెంచాలని ఆలోచిస్తోందని, త్వరలోనే పెంచుతుందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వ పత్రిక సమాచార కార్యాలయం (PIB) స్పందించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 2 సంవత్సరాలు పెంచి 62 ఏళ్లకు చేయనున్నట్లు, ఏప్రిల్ 1, 2025 నుంచి ఇది అమలులోకి వస్తుందని కూడా ప్రచారం జరుగుతోంది. ఇది నిజమేనా? PIB దీనిపై ఏం చెప్పిందంటే..

గత కొన్ని రోజులుగా రిటైర్మెంట్ వయసు పెరుగుతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఇది తప్పుడు వార్త అని, ఎవరు నమ్మవద్దని పీబీఐ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచే ఆలోచన ప్రభుత్వం వద్ద లేదని స్పష్టం చేసింది. రిటైర్మెంట్ వయసు పెంపు 2024, రిటైర్మెంట్ వయసు 2 సంవత్సరాలు పెంపు, కేబినెట్ సమావేశంలో ఆమోదం అనే శీర్షికతో ఒక లేఖ వైరల్ అవుతోంది. ఈ పథకం పేరు రిటైర్మెంట్ వయస్సు పెంపు పథకం అని కూడా ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు ఏప్రిల్ 1, 2025 నుంచి 2 సంవత్సరాలు పెంచి 62 ఏళ్లు చేస్తారని ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా దీని ద్వారా ప్రయోజనం పొందుతారని కూడా అందులో పేర్కొన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వ పత్రిక సమాచార కార్యాలయం ఇది ఫేక్ న్యూస్ Fake News అని, ఎవరూ ఆందోళనకు గురికావద్దని తెలిపింది. భారత ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకోలేదు అని వెల్లడించింది.

 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్