RBI | బ్యాంక్ ఖాతాదారులకు గమనిక.. మార్చిలో ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులంటే..?

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||ప్రతీకాత్మక చిత్రం||


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చి నెలలో బ్యాంకులకు సంబంధించిన సెలవులను ప్రకటించింది. బ్యాంకులకు వెళ్లాలనుకునే ఖాతాదారులు సెలవు దినాలను గమనించి ముందస్తుగా బ్యాంకు తెరచి ఉన్నపుడు బ్యాంకు వెళ్లేందుకు ఆర్బీఐ బ్యాంకు సెలవులను ప్రకటించింది. మార్చి నెలలో మొత్తం 12 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. నాలుగు ఆదివారాలు,  రెండు శనివారాలు, మిగతా పర్వదినాలను పునస్కరించుకొని సెలవులు ప్రకటించింది. 


మార్చి 3  : శుక్రవారం (చుప్‌చార్ కుట్‌-త్రిపుర రాజధాని అగర్తలలో సెలవు)

మార్చి 5 : ఆదివారం.

మార్చి 7 : మంగళవారం హోలీ

(బెలాపూర్‌, గువాహటి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, డెహ్రడూన్‌, జైపూర్‌, జమ్ము, కాన్పూర్‌, కోల్‌కతా, లక్నో,ముంబై, నాగ్‌పూర్‌, పనాజీ, రాంచీ, శ్రీనగర్‌లలో సెలవు).

మార్చి 8 :  బుధవారం హోలీ

(అగర్తల, ఐజ్వాల్‌, అహ్మదాబాద్‌, భోపాల్‌, భువనేశ్వర్‌, ఛండీగఢ్‌, డెహ్రాడూన్‌, గ్యాంగ్‌టక్‌, ఇంపాల్‌, కాన్పూర్‌, లక్నో, న్యూఢిల్లీ, పాట్నా, రాయ్‌పూర్‌, రాంచీ, షిల్లాంగ్‌, సిమ్లాల్లో బ్యాంకులకు సెలవు).

మార్చి 9 : గురువారం హోలీ (పాట్నా).

మార్చి 11 : రెండో శనివారం

మార్చి 12 : ఆదివారం

మార్చి 19 : ఆదివారం

మార్చి 22 : బుధవారం(తెలుగు సంవత్సరాది, ఉగాది, బీహార్ దివస్‌)

మార్చి 25 : నాలుగో శనివారం

మార్చి 26 : ఆదివారం

మార్చి 30 : గురువారం(శ్రీరామనవమి)


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్