బంగాళాఖాతంలో ఏర్పడిన అతి తీవ్ర తుఫాన్ దానా గురువారం రాత్రి పది గంటలకు ఒడిశాలోని పారాదీప్ దగ్గర తీరం దాటింది. ఈ తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
కురుస్తున్న వర్షం
బంగాళాఖాతంలో ఏర్పడిన అతి తీవ్ర తుఫాన్ దానా గురువారం రాత్రి పది గంటలకు ఒడిశాలోని పారాదీప్ దగ్గర తీరం దాటింది. ఈ తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రాత్రి 10 గంటల సమయంలో తీరం దాటిన తుఫాను ఆ తరువాత వాయువ్య దిశలోనే కదులుతూ ముందుకు వెళ్ళనుంది. ఆ తర్వాత ఇది క్రమంగా బలహీనపడుతూ 25వ తేదీ సాయంత్రానికి వాయుగుండంగా మారుతుంది. అనంతరం దిశ మార్చుకుంటూ ఉత్తర తెలంగాణ, ఉత్తరాంధ్రవైపు రానుంది. అందువల్ల అక్టోబర్ 26న వాయుగుండం ప్రభావంతో ఉత్తర, తూర్పు తెలంగాణ, ఉత్తరాంధ్రలోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
దీని ప్రభావం ఉత్తర తెలంగాణ, ఉత్తరాంధ్రపై అధికంగా కనిపించనుంది. ఈ ప్రభావంతో శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో మేఘాలు వస్తూపోతూ ఉంటాయి. రోజంతా పొడువు వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కొద్దిచోట్ల మినహా ఎక్కడ వర్షాలు పడే అవకాశం లేదు. గాలి వేగం పెరగడంతో పాటు చల్లని గాలులు వీచే అవకాశం ఉంది. తెలంగాణలో గాలి వేగం గంటకు 13 కిలోమీటర్లు ఉంటుంది. ఏపీలో అయితే గాలి వేగం గంటకు 14 కిలోమీటర్లు ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో గరిష్టంగా 31 డిగ్రీలు ఉంటుంది. ఏపీలో 34 డిగ్రీలు ఉంటుంది తీర ప్రాంతంలో వేడి అధికంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో తేమ శుక్రవారం తక్కువగానే ఉంటుంది. సాయంత్రం తర్వాత తేమ క్రమంగా పెరుగుతుంది. అయినప్పటికీ శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం లేదు. శనివారం మాత్రం ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని రైతులు గ్రహించాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.