Indian Railways | RAC టికెట్ క్యాన్సిల్ చేద్దామనుకుంటున్నారా.. బిగ్ రిలీఫ్ ఇచ్చిన రైల్వే శాఖ

RAC Ticket | ఐఆర్‌సీటీసీ నుంచి వెయిటింగ్ టికెట్ బుక్ చేసుకొన్నాక క్యాన్సిల్ అయితే కేవలం రూ.60 మాత్రమే చార్జి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గత నెలలోనే ప్రకటన చేసింది.

indian railways irctc

ప్రతీకాత్మక చిత్రం

ఈవార్తలు, రైల్వే : రైల్వే టికెట్ బుక్ చేసుకొని క్యాన్సిల్ చేస్తే భారీగా చార్జి వసూలు చేస్తారు. కన్ఫర్మ్ టికెట్ అయినా, ఆర్ఏసీ టికెట్ అయినా క్యాన్సిల్ అయితే ప్రయాణికులు భారీగా చెల్లించుకోవాల్సిందే. ఈ భారీ రుసుం నుంచి రైల్వే శాఖ భారీ ఉపశమనం కలిగించింది. ఐఆర్‌సీటీసీ నుంచి వెయిటింగ్ టికెట్ బుక్ చేసుకొన్నాక క్యాన్సిల్ అయితే కేవలం రూ.60 మాత్రమే చార్జి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గత నెలలోనే ప్రకటన చేసింది. ఆర్ఏసీ టికెట్ క్యాన్సిల్ చేస్తే ఆర్బిట్రరీ ఫీజు వసూలు చేయడంపై ఓ ఆర్టీఐ కార్యకర్త ఐఆర్‌సీటీసీకి లేఖ రాశాడు.

ఐఆర్‌సీటీసీయే స్వయంగా ఈ టికెట్లను క్యాన్సిల్ చేస్తుందని, అలాంటప్పుడు సర్వీస్ చార్జి పేరుతో వసూలు చేయడంపై ఆయన ఫిర్యాదు చేశాడు. దీన్నుంచి ప్రయాణికులకు ఉపశమనం కలిగించాలని కోరాడు. వెంటనే స్పందించిన ఐఆర్‌సీటీసీ రూ.60 మాత్రమే వసూలు చేస్తామని ప్రకటించింది. ఈ సమస్యను రైల్వే ఎండీ దృష్టికి కూడా వెళ్లడంతో ఆ ఆర్టీఐ కార్యకర్తను అభినందించారు. ప్రయాణికులకు మేలు కలిగించే సమస్యను లేవనెత్తారని కొనియాడారు. ఆ ఆర్టీఐ కార్యకర్త కూడా రైల్వేశాఖకు కృతజ్ఞతలు తెలిపారు. తాను సమస్యను రైల్వే శాఖ దృష్టికి తెచ్చిన వెంటనే పరిష్కరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్