ప్రధాని నరేంద్ర మోడీని మించిపోయిన బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ పాపులారిటీ

ప్రధాని నరేంద్ర మోడీకి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆయనకు ఉన్న పాపులారిటీ ఎటువంటిదో దేశంలోని ప్రతి ఒక్కరికి తెలిసిందే. అగ్రరాజ్యాధినేతలు కూడా మోడీ పాపులారిటీ ముందు కనిపించడం లేదు. అటువంటి నరేంద్ర మోడీ బాలీవుడ్ హీరోయిన్ నుంచి తీవ్రమైన పోటీని కొన్నాళ్లుగా ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఆ హీరోయిన్ నరేంద్ర మోడీని కూడా దాటేసింది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో ఒకటైన ఇన్ స్టాగ్రామ్ లో నరేంద్ర మోడీ వరకు మూడో స్థానంలో కొనసాగుతూ వచ్చారు.. తాజాగా ఈ స్థానాన్ని బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ దక్కించుకున్నారు.

PM Modi, shraddha kapoor

ప్రధాని మోడీ, శ్రద్ధా కపూర్ 

ప్రధాని నరేంద్ర మోడీకి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆయనకు ఉన్న పాపులారిటీ ఎటువంటిదో దేశంలోని ప్రతి ఒక్కరికి తెలిసిందే. అగ్రరాజ్యాధినేతలు కూడా మోడీ పాపులారిటీ ముందు కనిపించడం లేదు. అటువంటి నరేంద్ర మోడీ బాలీవుడ్ హీరోయిన్ నుంచి తీవ్రమైన పోటీని కొన్నాళ్లుగా ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఆ హీరోయిన్ నరేంద్ర మోడీని కూడా దాటేసింది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో ఒకటైన ఇన్ స్టాగ్రామ్ లో నరేంద్ర మోడీ వరకు మూడో స్థానంలో కొనసాగుతూ వచ్చారు.. తాజాగా ఈ స్థానాన్ని బాలీవుడ్ హీరోయిన్  శ్రద్ధా కపూర్ దక్కించుకున్నారు. దేశంలోని సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖుల్లో ఎక్కువ మంది ఇన్ స్టాగ్రామ్ లో ఎవరిని ఫాలో అవుతున్నారు అన్నది ఆసక్తిని కలిగిస్తూ ఉంటుంది. ఈ జాబితాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్నది కోహ్లీకి.  270 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ను కోహ్లీ కలిగి ఉన్నాడు. ఇన్ స్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్స్ ను కలిగిన జాబితాలో కోహ్లీ టాప్ లో కొనసాగుతుండగా, 91.8 మిలియన్లతో ప్రియాంక చోప్రా రెండో స్థానంలో కొనసాగుతున్నారు.

ఇప్పటి వరకు ప్రధాని నరేంద్ర మోడీ 91.3 మిలియన్ల ఫాలోవర్స్ తో మూడో స్థానంలో ఉన్నారు. తాజాగా ఈ స్థానాన్ని శ్రద్ధా కపూర్ దక్కించుకున్నారు. తాజాగా విడుదలైన స్త్రీ 2 సినిమా విజయవంతం కావడంతో శ్రద్ధా కపూర్ ఫాలోవర్స్ సంఖ్య భారీగా పెరిగింది. దీంతో ఆమె ఫాలోవర్స్ సంఖ్య 91.4 మిలియన్లకు చమిలియన్లకు మూడో స్థానానికి చేరుకుంది. ఈ క్రమంలోనే ఆమె ప్రధాని నరేంద్ర మోడీని అధిగమించింది. ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్స్ ను కలిగి ఉన్న వారి జాబితాలో ప్రధాన మోడీ నాలుగో స్థానానికి పడిపోయారు. ట్విట్టర్లో మాత్రం ప్రధాని మోడీ తొలి స్థానంలోనే కొనసాగుతున్నారు. 101.2 మిలియన్ల ఫాలోవర్లతో మోడీ అగ్రస్థానంలో ఉన్నారు. శ్రద్ధా కపూర్ ఇప్పటి వరకు 2081 పోస్టులు ఇన్ స్టాగ్రామ్ లో చేసింది. 865 మందిని ఆమె ఫాలో అవుతున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ విషయానికి వస్తే ఇప్పటివరకు ప్రధాని ఎనిమిది వందల పదమూడు పోస్టులు చేశారు. ఆయన ఒక్కరిని కూడా ఫాలో కావడం లేదు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్