Pan Card 2.0 : పాన్ కార్డు 2.0 పూర్తి వివరాలు ఇవే..

పాన్ 2.0 ప్రాజెక్ట్‌ పేరుతో కొత్త పాన్ కార్డ్ తీసుకొస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దానికోసం రూ.1,435 కోట్టు ఖర్చు చేస్తోంది. ఈ కొత్త కార్డులకు క్యూఆర్ కోడ్‌లను తీసుకువస్తున్నారు.

pan card

ప్రతీకాత్మక చిత్రం

పాన్ 2.0 ప్రాజెక్ట్‌ పేరుతో  కొత్త పాన్ కార్డ్ తీసుకొస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దానికోసం రూ.1,435 కోట్టు ఖర్చు చేస్తోంది. ఈ కొత్త కార్డులకు క్యూఆర్ కోడ్‌లను తీసుకువస్తున్నారు. పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలు, సాంకేతికంగా మార్పులు తీసుకురావడమే దీని ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వం పాన్ 2.0  ప్రాజెక్ట్ తీసుకొస్తున్న సందర్భంగా.. పాన్‌కార్డ్ గురించి ప్రజల్లో చాలా సందేహలు వస్తున్నాయి. అసలు పాత పాన్ కార్డ్ పరిస్థితి ఏంటి? మళ్లీ కొత్తది అప్లై చేసుకోవటమా? లేక కార్డ్ కరెక్షన్ చేసుకోవటమా? వంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో ఆదాయపు పన్ను శాఖ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.

కొత్త కార్డు అవసరం లేదు: ఇదివరకే పాన్ కార్డు ఉన్న వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. పాత పాన్ కార్డ్‌లనే వాడుకోవచ్చు. పాత కార్డ్‌లోని నంబర్లే కొనసాగుతాయి. అందులో ఎలాంటి మార్పులు జరుగవు. 

సరిదిద్దుబాటు అవకాశం: పాన్‌కార్డ్ దారులు కార్డ్‌లో ఏవైనా  తప్పులు ఉంటే సరిగా మార్చుకునే అవకాశం ఉంది. ఈమెయిల్, మొబైల్ నెంబర్, అడ్రస్, పుట్టిన తేదీ, పేరు మార్పిడి చేసుకోవచ్చు. పాన్ 2.0 ప్రాజెక్టులో భాగంగా ఉచితంగానే ఈ అవకాశం కల్పిస్తుంది కేంద్ర ప్రభుత్వం. మీరు మార్పిడి చేసుకునే వివరాలను ఎన్‌ఎస్‌డీఎల్, యూటీఐఎస్‌ఎల్ వెబ్‌సైట్ల ద్వారా చేసుకోవచ్చని ఐటీ శాఖ తెలిపింది.

ఇప్పటికే పలు కార్డులకు క్యూఆర్ కోడ్ అయితే..

పాన్ 2.0 ప్రాజెక్ట్‌లో పాన్ కార్డులన్నీ క్యూఆర్ కోడ్‌తో వస్తాయి. ఈ క్యూఆర్ కోడ్ విధానం 2017-18 నుంచే జారీ చేస్తున్న కార్డులపై ముద్రించారు. దీన్నే 2.0 లోనూ కొనసాగిస్తున్నారు. ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే పాన్ డేటా బేస్‌లో ఉన్న వివరాలు కనిపిస్తాయి. క్యూఆర్ కోడ్‌ లేని పాన్‌కార్డుదారులు క్యూఆర్ కోడ్ కలిగిన కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్