రుక్మాపూర్ గురుకుల సైనిక స్కూల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

|| రుక్మాపూర్ సైనిక్ స్కూల్ ||

ఈవార్తలు, తెలంగాణ: తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలోని రుక్మాపూర్‌లో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక స్కూల్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. 2023-2024 విద్యా సంవత్సరానికి సైనిక్ స్కూల్స్‌లో అడ్మిషన్ కోరుకునే అభ్యర్థులకు కరీంనగర్ జిల్లా రుక్మాపూర్ లో 6 తరగతి, ఇంటర్ సీట్ల భర్తీ కోసం దరఖాస్తు స్వీకరిస్తున్నారు. ఫిబ్రవరి 15 వరకు దరఖాస్తు స్వీకరిస్తున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన పరీక్ష ఫిబ్రవరి 26న నిర్వహించనున్నారు. ఫలితాలను మార్చి 8వ తేదీన విడుదల చేయగా మార్చి 10, 12, 14, 18, 19 తేదీలలో ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

సీట్ల వివరాలు : 6వ తరగతి, ఇంటర్.

చివరి తేదీ : ఫిబ్రవరి 15

పరీక్ష తేదీ : ఫిబ్రవరి 26

ఫలితాలు : మార్చి 8

ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలు : మార్చి 10, 12, 14, 18, 19


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్