యూనిఫాంలు అమ్మితే తాట తీస్తాం.. ప్రైవేట్ స్కూళ్లకు ప్రభుత్వం హెచ్చరిక

తెలంగాణ ప్రభుత్వం.. ప్రైవేట్ స్కూళ్లకు గట్టి హెచ్చరిక జారీ చేసింది. స్కూళ్లలో యూనిఫాంలు, బూట్లు, బెల్టులు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. స్కూళ్లలో వీటి అమ్మకాలపై నిషేధం విధించింది.

school students

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్, ఈవార్తలు : విద్యాసంవత్సరం ప్రారంభం కాగానే ప్రైవేట్ స్కూళ్లు పెద్ద దందాకు తెర తీస్తుంటాయి. పిల్లలకు చదువు చెప్పే కన్నా, ఎక్స్‌ట్రా ఖర్చులతో తల్లిదండ్రుల సంపాదనను పిండేస్తుంటాయి. యూనిఫాంలు, బూట్లు, బెల్టులు అంటూ వేలకు వేలు వసూలు చేస్తుంటాయి. ఇక స్టేషనరీ, పుస్తకాలు అంటూ అడ్డగోలుగా వసూలు చేస్తుంటాయి. ఎంతో మంది తల్లిదండ్రులు దీనిపై అసహనం వ్యక్తం చేసినా చేసేదేం లేక ఫీజులు చెల్లించుకుంటున్నారు. దీన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం.. ప్రైవేట్ స్కూళ్లకు గట్టి హెచ్చరిక జారీ చేసింది. స్కూళ్లలో యూనిఫాంలు, బూట్లు, బెల్టులు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. స్కూళ్లలో వీటి అమ్మకాలపై నిషేధం విధించింది. అయితే, స్టేషనరీ, పుస్తకాలు వంటివి లాభాపేక్ష లేకుండా అమ్ముకోవచ్చని స్పష్టం చేసింది.

ఈ మేరకు హైదరాబాద్ డీఈవో స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు (రాష్ట్ర, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ) పరిధిలో యూనిఫాంలు, బూట్లు, బెల్టులు అమ్మడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. బుక్స్, నోట్ బుక్స్, స్టేషనరీ తదితర విక్రయాలు వాణిజ్యేతరంగా ఉండాలని వెల్లడించారు. స్కూళ్లలో తనిఖీలకు, పర్యవేక్షణకు మండల స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని డిప్యూటీ ఎడ్యుకేషనల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. యూనిఫాంల విక్రయాలు లేకుండా చూడాలని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు.

hyderabad deo
హైదరాబాద్ డీఈవో జారీ చేసిన సర్క్యూలర్


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్