||ప్రతీకాత్మక చిత్రం||
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గోర్లు, జుట్టును కత్తిరించుకోవటానికి ఒక ప్రత్యేకమైన రోజు ఉంటుంది. చనిపోయిన కణాలతో ఏర్పడే గోర్లు.. కాళ్లు, చేతుల ఆకారాన్ని అందంగా చూపించేందుకు ఉపయోగపడతాయి. జుట్టు అనేది చర్మంలో కనిపించే ఫోలికల్స్ నుండి పెరిగే ప్రోటీన్ ఫిలమెంట్. అయితే వీటిని కత్తిరించడానికి తప్పనిసరిగా నియమాలు పాటించాలని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అలా కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు కత్తిరించడం వలన వారికి కష్ట, నష్టాలు తప్పవంటున్నారు జ్యోతిష్యులు. గోర్లు, జుట్టు కత్తిరించే విషయంలో తప్పనిసరిగా నియమాలను పాటించాలని లేదంటే ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలుసుకుందాం..
జుట్టు, గోర్లు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని దేవునికి సంబంధించినవి అని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది. వీటిని శుభ్రంగా ఉంచుకుంటే శని దేవుని అనుగ్రహం ఉంటుంది. లేదంటే శని దేవునికి కోపం వచ్చి ఆశుభ ఫలితాలను శని దేవుడు ఇస్తాడు.
జుట్టు, గోర్లను శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఎప్పుడు కత్తిరించాలి, ఏ సమయంలో కత్తిరించాలి, అనేవి స్పష్టంగా తెలుసుకొని ఉండాలి.
గోర్లను, జుట్టును మంగళ, గురు,శనివారాల్లో ఎట్టి పరిస్థితుల్లోని కత్తిరించకూడదు. అలా కాదని కత్తిరించడం వల్ల ఆశుభ ఫలితాలు మొదలవుతాయి.
మంగళవారానికి అధిపతి అయిన కుజుడు మంగళవారం రోజు గోర్లు, జుట్టు కత్తిరించడం వలన వివాహం, సంపద, ధైర్య లేకపోవడం వంటి సమస్యలు కలిగేలా చేస్తాడు.
ఇక గురువారం రోజు గోర్లు, జుట్టు కత్తిరించడం వలన గురువారానికి అధిపతి అయిన గురు గ్రహాన్ని దురదృష్టాన్ని ఆహ్వానించి పలికినట్టే అని జ్యోతిష్య శాస్త్రంలో తెలుపబడింది.
ఇక శనివారం రోజున గోర్లు కత్తిరించినట్లయితే శని గ్రహానికి కోపం వచ్చి ధన నష్టం కలిగి పేదరికం వస్తుంది.
అలాగే అమావాస్య, చతుర్దశి తిధులలో కూడా గోర్లు జుట్టు కత్తిరించడం వలన అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా గోర్లను సూర్యాస్తమం తర్వాత కత్తిరించడం వలన మనిషి పేదవాడు అవుతాడు. మధ్యాహ్నం సమయంలో బోర్లు కత్తిరించడం ఉత్తమం.
అంటే ఆదివారం, సోమవారం, బుధవారం, శుక్రవారం రోజులలో గోర్లు, జుట్టును కత్తిరించుకోవడం మంచిది. ఇలా చేయడం వలన పేదరికం దూరమై మంచి అభివృద్ధి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది.