Vastu Shastra | ఇంటికి సంబంధించి కచ్చితంగా తెలుసుకోవాల్సిన వాస్తు నియమాలు ఇవే..

హిందూ సమాజంలో వాస్తుకు ప్రత్యేక స్థానం ఉంది. ఇంట్లో ఏ వస్తువు ఏ దిక్కున ఉండాలి? అన్నది కచ్చితత్వంతో వాస్తు శాస్త్రం చెప్పబడింది. నాలాలకు దగ్గరలో, చెరువులకు దగ్గరలో, నదీ పరిసరాల్లో, సముద్ర ప్రాంతాల్లో ఇళ్లు కట్టుకోవద్దని వాస్తు శాస్త్రం చెప్తోంది.

home tips

ప్రతీకాత్మక చిత్రం

హిందూ సమాజంలో వాస్తుకు ప్రత్యేక స్థానం ఉంది. ఇంట్లో ఏ వస్తువు ఏ దిక్కున ఉండాలి? అన్నది కచ్చితత్వంతో వాస్తు శాస్త్రం చెప్పబడింది. నాలాలకు దగ్గరలో, చెరువులకు దగ్గరలో, నదీ పరిసరాల్లో, సముద్ర ప్రాంతాల్లో ఇళ్లు కట్టుకోవద్దని వాస్తు శాస్త్రం చెప్తోంది. కానీ, మొన్నటికి మొన్న హైదరాబాద్‌లోని మూసీ నదీ పరివాహకంలో, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఇళ్లు కట్టుకున్నవాళ్లు ఉన్నారు. అయితే, ఇల్లుకు వాస్తు చూసినవాళ్లు.. ఆ ఇంటి స్థలం ఏ చోట ఉందనేదీ తెలుసుకోలేక.. వాస్తుపై నిందలు వేశారు. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి ఏది మంచిది.. ఏది చెడ్డది అని పరిశీలిస్తే..

  • ఇతరుల ఇళ్లలోని వాడకం నీరు మన ఇంటి ఆవరణలోనికి ప్రవేశించడం మంచిది కాదు.
  • వీలైనంత వరకు రెండు లేదా మూడు పటాలను మాత్రమే దేవుని గదిలో ఉంచాలి. 
  • గృహం ముందు కానీ, ఖాళీ ప్రదేశంలో కానీ వాయవ్యం మెరక కలిగి ఉన్నట్లు అయితే వంశవృద్ధి, ఐశ్వర్యము సకల సుఖాలు కలుగుతాయి. 
  • పూజ గదికి ఎప్పుడూ రెండు తలుపులు ఉండేలా చూడాలి, ఈ గదికి తప్పని సరిగా గడప ఉండాలి. 
  • పడక గదిలో పూజకి సంబందించిన వస్తువులు కానీ, దేవుని పటాలు కానీ పెట్టకూడదు.పూజ కోసం కేటాయించిన ప్రాంతంలో శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. 
  • తూర్పు, ఈశాన్య దిశలో పొడవైన వృక్షాలు ఉంటే ప్రతికూల ప్రభావం చూపుతుంది.
  • పత్తి, తాటిచెట్టు ఇంటి ఆవరణలో ఉంటే అశుభం.
  • కుండీల్లో పెంచుకున్న మొక్కలను ఇంటికి ఉత్తర, తూర్పు దిక్కులోని గోడలపై ఉంచరాదు.
  • ఆగ్నేయ దిశలో వంటగది ఉండాలి. 
  • చీపురు శనీశ్వరుని ఆయుధం. అందువల్ల గోడకు అనించేటప్పుడు చీపురు హ్యండిల్ పైకి మాత్రమే పెట్టి ఉంచడం శుభకరం.
  • ఫిష్ అక్వేరియం ఇంట్లో ఉంచుకోవడం మేలు. ఇంటిలోని చెడును బయటకు పంపించి నిర్మలమైన వాతావరణం కలిగించేందుకు సహయపడుతుంది. 
  • మనీ ప్లాంట్ ఇంట్లో వుంచడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు ఉండవు. 
  • ఇంట్లో ఎప్పుడు తూర్పు ముఖంగానే వంట చేయాలి.

సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్